Safest Cars in India: క్రాష్ టెస్ట్‌లో టాప్ రేటింగ్.. మన దేశంలో 5 అత్యుత్తమైన, సురక్షితమైన కార్లు ఇవే..

Safest Cars in India: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ తమకు సొంతంగా ఒక కారు ఉంటే బాగుంటుందని భావించి కారును కొనుగోలు చేస్తున్నారు. కారు కొనే ముందు అధునాతన ఫీచర్లు, మైలేజీ చెక్ చేసి తీసుకుంటుంటారు.

Safest Cars in India: క్రాష్ టెస్ట్‌లో టాప్ రేటింగ్.. మన దేశంలో 5 అత్యుత్తమైన, సురక్షితమైన కార్లు ఇవే..
Car
Follow us

|

Updated on: Dec 14, 2022 | 4:37 PM

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ తమకు సొంతంగా ఒక కారు ఉంటే బాగుంటుందని భావించి కారును కొనుగోలు చేస్తున్నారు. కారు కొనే ముందు అధునాతన ఫీచర్లు, మైలేజీ చెక్ చేసి తీసుకుంటుంటారు. అయితే, కొత్త వాహనం కొనాలనుకునే వారు.. ఈ ఫీచర్లు, మైలేజీతో పాటు మరొకటి కూడా గమనించాల్సిన అవసరం ఉంది. మీరు ప్లాన్ చేస్తున్న కారు కి గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఎంత రేటింగ్ వచ్చిందో కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే.. మైలేజీ, ఫీచర్ల కంటే భద్రత చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో భారతదేశంలో 5 సురక్షితమైన వాహనాల గురించిన సమాచారం మీ ముందుకు తీసుకువచ్చాం. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.

మహీంద్రా థార్:

అడ్వెంచర్ కారు. పెద్దలు, పిల్లల రక్షణ కోసం క్రాష్ టెస్ట్‌లో 4 స్టార్ స్కోర్ చేసింది. వయోజన రక్షణలో కూడా 4 స్టార్ రేటింగ్‌ను పొందింది. ఈ కారు ధర రూ. 13,59,101 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుండి ప్రారంభమవుతుంది.

వోక్స్‌వ్యాగన్ టైగన్:

జర్మన్ కార్‌మేకర్ వోక్స్‌వ్యాగన్ కాంపాక్ట్ SUV కార్ టైగన్ ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్‌ను అందుకుంది. ఈ SUV పెద్దలు, పిల్లల సెఫ్టీ రెండింటిలోనూ 5 స్టార్ రేటింగ్‌లను పొందింది. ఈ కారు ధర 11,55,900 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది.

మహీంద్రా స్కార్పియో ఎన్:

ఇది మహీంద్రా & మహీంద్రా కంపెనీకి చెందిన కారు. స్కార్పియో SUV న్యూ జనరేషన్ వెర్షన్. ఈ కారు పెద్దల సెఫ్టీలో 5 స్టార్ రేటింగ్‌ను పొందింది. కానీ పిల్లల సేఫ్టీలో కేవలం 3 స్టార్ రేటింగ్‌ను మాత్రమే పొందింది. ఈ కారు ధర 11,98,999 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుండి ప్రారంభమవుతుంది.

టాటా పంచ్:

టాటా మోటార్స్ నుండి వచ్చిన చిన్న SUV కారు. ఈ కారు గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో అద్భుతమైన పనితీరును చూపింది. 5 స్టార్ రేటింగ్‌ను పొందింది. పెద్దల సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్, పిల్లల సేఫ్టీలో 4 స్టార్ రేటింగ్ పొందింది. ఈ కారు ధర రూ. 5.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుండి ప్రారంభమవుతుంది.

స్కోడా కుషాక్:

స్కోడా నుండి వచ్చిన ఈ కాంపాక్ట్ SUV గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్‌ను పొందింది. ఈ కారు పిల్లలు, పెద్దల సేఫ్టీ విషయంలో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది. ఈ కారు ధర రూ. 16.39 లక్షల(ఎక్స్ షోరూమ్ ప్రైజ్) నుంచి ప్రారంభమవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..