Shocking Video: జస్ట్ మిస్.. చెరువులో పడబోయిన ఆర్టీసీ బస్సు.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో..

ప్రమాదం చెప్పి రాదు.. ఏ క్షణం ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. కానీ, ప్రమాదానికి గురైనప్పటికీ అదృష్టం కొద్ది వెంట్రుకవాసిలో తప్పించుకున్నంటే.. వారి ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా?..

Shocking Video: జస్ట్ మిస్.. చెరువులో పడబోయిన ఆర్టీసీ బస్సు.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో..
Apsrtc
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 14, 2022 | 4:41 PM

ప్రమాదం చెప్పి రాదు.. ఏ క్షణం ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. కానీ, ప్రమాదానికి గురైనప్పటికీ అదృష్టం కొద్ది వెంట్రుకవాసిలో తప్పించుకున్నంటే.. వారి ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా? తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే. అవును, ఈ వీడియో చూస్తే మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. తాజాగా ఏపీలో జరిగిన ఓ భయంకరమైన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో చూసి జనాలు హడలిపోతున్నారు. బాప్ రే అంటూ గుండెల మీద చేయి వేసుకుని గట్టిగా ఊపిరి పీల్చుకుంటున్నారు.

కైకలూరు మండలం పల్లెవాడ వద్ద రోడ్డుపై ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు వెళ్తుండగా.. ఒక్కసారిగా ద్విచక్రవాహనదారుడు రోడ్డుపైకి దూసుకొచ్చాడు. దాంతో అలర్ట్ అయిన బస్సు డ్రైవర్ ఆ బైక్‌ను తప్పించబోయాడు. దాంతో బస్సు ఆ అదుపు తప్పింది. అలా అదుపు తప్పిన బస్సు రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. అదృష్టం కొద్ది.. బస్సు బోల్తా కొట్టే సమయంలో చెరువు గట్టును ఢీకొని బస్సు ఆగిపోయింది. బస్సు ప్రమాదానికి గురైన సమయంలో 50 మంది ప్రయాణికులు అందులో ఉన్నారు.

బస్సుకు ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. చెరువు గట్టున నిలిచిపోయిన బస్సు నుంచి ప్రయాణికులు ప్రాణభయంతో త్వరత్వరగా దిగిపోయారు. అయితే, ఈ ప్రమాదం.. సమీపంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. రెండు రోజుల క్రితం ఈ ప్రమాదం జరుగగా.. ఇప్పుడు అందుకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో చూసి జనాలు షాక్ అవుతున్నారు. ఏమాత్రం తేడా జరిగినా.. ఎంత మంది ప్రాణాలు గాల్లో కలిసేవోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్