Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best Qualities of Girl: అమ్మాయిలో ఈ లక్షణాలుంటే పెళ్లి చేసుకోవడానికి అస్సలు సంకోచించకండి..

Chanakya Niti: రాజనీతిజ్ఞతతో పాలించడమే కాకుండా, సామాజిక జీవితంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను కూడా చెప్పారు ఆచార్య చాణక్యుడు. ఆయన చెప్పిన విషయాలు నేటికీ ఆచరణీయమైనవే.

Best Qualities of Girl: అమ్మాయిలో ఈ లక్షణాలుంటే పెళ్లి చేసుకోవడానికి అస్సలు సంకోచించకండి..
Chanakya Niti
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 14, 2022 | 1:42 PM

రాజనీతిజ్ఞతతో పాలించడమే కాకుండా, సామాజిక జీవితంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను కూడా చెప్పారు ఆచార్య చాణక్యుడు. ఆయన చెప్పిన విషయాలు నేటికీ ఆచరణీయమైనవే. చాణక్యుడు తన నీతిశాస్త్రంలో జీవితంలో ప్రతి విషయానికి సంబంధించి అనేక కీలక సూచనలు, దిశానిర్దేశం చేశాడు. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు? జీవన విధానం ఎలా ఉండాలి? ఎవరితో మాట్లాడాలి? ఎవరికి దూరంగా ఉండాలి? ఎలా మాట్లాడాలి? ఏం మాట్లాడకూడదు వంటి సమగ్ర వివరాలను పేర్కొన్నారు. ఇదే మాదిరిగా యువత జీవితంలో అత్యంత ముఖ్యమైన సమయం వివాహ సమయం. ఆ సమయంలో తీసుకునే నిర్ణయాలను బట్టి భవిష్యత్తులో భార్యాభర్తల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయనేది ఆధారపడి ఉంటుందని చాణక్యుడు చెప్పారు.

ఆచార్య చాణక్య ప్రకారం.. అబ్బాయిల మాదిరిగానే, అమ్మాయిలలో కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. అవి ఎల్లప్పుడూ వైవాహిక జీవితాన్ని బిజీగా ఉంచుతాయి. ఇవాళ మనం ఈ లక్షణాల గురించి తెలుసుకుందాం. నీతి శాస్త్రంలో చెప్పిన లక్షణాలు ఉన్న అమ్మాయి మీకు తారసపడితే.. పెళ్లి చేసుకోవడానికి ఏమాత్రం సంకోచించొద్దంటారు ఆచార్య చాణక్యుడు.

ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేవారు..

వివాహం అనేది జీవితంలో అత్యంత ముఖ్యమైన నిర్ణయం. పెళ్లి విషయంలో ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. తృప్తి చెందడం, ఉన్నదాంతో సర్దుకుపోవడం, ప్రవర్తనలో స్థిరత్వం ఉంటుందో వారిని జీవిత భాగస్వామిగా ఎంచుకోవాలి. ఆడపిల్లల్లో, అబ్బాయిల్లో అత్యాశ భావం ఉంటే అది వారి జీవితంపైనే దుష్ప్రభావం చూపుతుంది. అత్యాశ లేని ఆడపిల్లలు భర్తకే కాదు కుటుంబానికి కూడా మేలు చేస్తారు. పూర్వం స్త్రీలు సహనంతో వైవాహిక జీవితాన్ని గడపడానికి ప్రయత్నించేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి అలా లేదు.

ఇవి కూడా చదవండి

కోపాన్ని నియంత్రించుకునే సామర్థ్యం..

కోపం అనేది ప్రతి వ్యక్తి జీవితంలో డార్క్ మార్క్. ఇది ఏ సంబంధాన్ని అయినా క్షణికావేశంలో నాశనం చేస్తుంది. కోపం కారణంగా పెద్ద పెద్ద సామ్రాజ్యాలే ధ్వంసమైనట్లు చరిత్ర చెబుతోంది. తమ కోపాన్ని అదుపులో ఉంచుకునే సామర్థ్యం ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు మంచి జీవిత భాగస్వాములుగా ఉంటారు. అలాంటి వ్యక్తులతో సంబంధాన్ని తప్పకుండా కలుపుకోవచ్చు.

ఓదార్పునిచ్చేవారు..

ప్రతి వ్యక్తి తన జీవిత భాగస్వామి ఇలా ఉండాలని భావిస్తుంటారు. కష్టమైనా, సుఖమైనా, దుఃఖమైనా ప్రతి సందర్భంలోనూ తనకు అండగా నిలుస్తారని ఆశిస్తారు. మీరు వివాహం చేసుకోబోయే అమ్మాయిలో ఈ లక్షణం ఉన్నట్లయితే.. వారిని వివాహం చేసుకోవడంలో సంశయించొద్దు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..