- Telugu News Photo Gallery Sports photos FIFA World Cup 2022 Lionel Messi took an Photo with 12 Years Old Julian Alaverez a Decade ago Now Photo Goes Viral on Social Media
Messi – Alaverez: ఒకప్పుడు ఆ స్టార్‌తో కలిసి ఒక్క ఫోటో దిగినా చాలనుకున్నాడు.. కానీ, నేడు అతనితోనే కలిసి..
FIFA వరల్డ్ కప్ 2022లో అర్జెంటీనా టీమ్ ఫైనల్‌కు చేర్చడంలో ఆ టీమ్ యువ స్టార్ ప్లేయర్ జూలియన్ అల్వారెజ్ కీలక పాత్ర పోషించాడు. టాప్ ప్లేయర్ లియోనెల్ మెస్సీతో కలిసి జట్టును వరల్డ్ కప్ ఫైనల్‌కు చేర్చాడు.
Updated on: Dec 14, 2022 | 2:54 PM

లియోనెల్ మెస్సీ, జూలియన్ అల్వారెజ్ అద్భుతమైన ప్రదర్శనతో అర్జెంటీనా టీమ్ 3-0తో క్రొయేషియాను ఓడించి FIFA ప్రపంచ కప్‌లో ఫైనల్‌లోకి ప్రవేశించింది. మ్యాచ్ అనంతరం మెస్సీ, అల్వారెజ్ జోడీ సోషల్ మీడియాలో ట్రెండ్‌లో నిలిచారు. ఎందుకంటే.. ఈ ఇద్దరు ఆటగాళ్లకు సంబంధించిన 10 ఏళ్ల నాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

1958 నుండి ఇప్పటి వరకు ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో రెండు గోల్స్ చేసిన రెండవ అతి పిన్న వయస్కుడైన ప్లేయర్‌గా అల్వారెజ్ నిలిచాడు. 1958లో 17 ఏళ్ల వయసులో పీలే ఈ ఘనత సాధించాడు. అయితే, అల్వారెజ్ నాలుగు గోల్స్ చేశాడు. తద్వారా మెస్సీ, కైలియన్ ఎమ్బాప్ తరువాతి స్థానాల్లో నిలిచాడు.

అర్జెంటినాకు చెందిన స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీని చూసి ప్రభావితమై ఫుట్‌బాట్ ప్లేయర్‌గా మారిన వారిలో అల్వారెజ్ కూడా ఒకడు. తన చిన్నప్పటి నుంచి మెస్సీలా స్టార్ అవ్వాలనుకున్నాడు. అయితే, మెస్సీతో జీవితంలో ఒక్క ఫోటో అయినా దిగాలని భావించాడు. కాలం అతనికి సహకరించింది. 12 సంవత్సరాల వయస్సులో తన డ్రీమ్ ప్లేయర్ మెస్సీని కలుసుకునే అవకాశం వచ్చింది. మెస్సీతో కలిసి నాడు ఫోటో దిగాడు.

అల్వారెజ్ 10 సంవత్సరాల క్రితం మెస్సీతో కలిసి దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఇద్దరూ అర్జెంటీనా జెర్సీలో కనిపించారు. అల్వారెజ్ చిన్ననాటి వీడియో కూడా వైరల్ అవుతోంది. ప్రపంచ కప్ ఆడటం తన అతిపెద్ద కల అల్వారెజ్ వీడియోలో చెప్పాడు. అలాగే ఫుట్‌బాల్ ప్రపంచంలో తన హీరో మెస్సీ అని చెప్పాడు.

ఫిఫా వరల్డ్ కప్ 2022లో భాగంగా అర్జెంటినా, క్రొయేషియా మధ్య జరిగి మ్యాచ్‌తో అల్వారెజ్ రెండు కలలు నెరవేరాయి. తన ఆరాధ్య దైవం లియోనెల్ మెస్సీతో కలిసి అర్జెంటీనాను ఫైనల్స్‌కు చేర్చాడు. దాంతో అభిమానుల చూపు ఈ ఇద్దరి జోడీపై పంది. అల్వారెజ్ కూడా తన జట్టు ప్రపంచ కప్ అందివ్వాలని ఉవ్విల్లూరుతున్నాడు.




