Old City Murder: లలితాబాగ్ ఎంఐఎం కార్పొరేటర్ అల్లుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి.. చికిత్స పొందుతూ మృతి
హైదరాబాద్‌లో దారుణం జరిగింది. లలితాబాగ్ ఎంఐఎం కార్పొరేటర్ అల్లుడు మొహమ్మద్ అనస్‌పై కత్తులతో దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. విచక్షణారహితంగా దాడి చేయడంతో మొహమ్మద్ అనస్ రక్తపు మడుగులు..
హైదరాబాద్ పాతబస్తీలో మరో హత్య జరిగింది. అంతా చూస్తుండగా కత్తులతో దాడి చేసి మరీ చంపేశారు. లలితాబాగ్ ఎంఐఎం కార్పొరేటర్ ఆఫీస్‌లో ఈ హత్య జరిగింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన కొందరు వ్యక్తులు ఈ దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. కత్తులతో కార్యాలయంలోకి చొరబడ్డ దుండగులు..కార్పొరేటర్ అల్లుడు మొహమ్మద్ అనస్‌పై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. కత్తులు, కర్రలతో దాడికి దిగడంతో కార్పొరేటర్ అల్లుడు అనస్ అక్కడే కుప్పకూలి పోయాడు. చనిపోయాడని వదలివెళ్లిన తర్వాత కార్పొరేటర్ అనుచరులు అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్రంగా గాయపడిన అనస్ ఆస్పత్రిలో చికత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషయం పాత బస్తీ మొత్తం తెలియడంతో పెద్ద ఎత్తున ఎంఐఎం కార్యకర్తలు అక్కడికి చేరుకుంటున్నారు.
అయితే దాడికి గల కారణాలు మాత్రం తెలియలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలు పెట్టారు. హత్య ఎలా జరిగింది..? హత్య చేసింది ఎవరు..? ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం