AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gautam Adani: హైదరాబాద్‌పై అదానీ కన్ను.. ఆ ప్లాన్ వర్కౌట్ అయితే కోట్ల సంపాదనకు రహదారే..

గౌతం అదానీ.. ప్రపంచ వ్యాపార రంగంలో మార్మోగుతున్న పేరు.. అనేక రంగాల్లో రాణిస్తున్న గౌతం అదానీ.. 2022లో సంపద వృద్ధిలో భారత దేశంలోనే మొదటిస్థానంలో నిలిచారు. ప్రపంచ స్థాయి కుబేరుల్లో మూడో స్థానంలో కొనసాగుతున్నారు.

Gautam Adani: హైదరాబాద్‌పై అదానీ కన్ను.. ఆ ప్లాన్ వర్కౌట్ అయితే కోట్ల సంపాదనకు రహదారే..
Gautam Adani
Shaik Madar Saheb
|

Updated on: Dec 19, 2022 | 2:17 PM

Share

గౌతం అదానీ.. ప్రపంచ వ్యాపార రంగంలో మార్మోగుతున్న పేరు.. అనేక రంగాల్లో రాణిస్తున్న గౌతం అదానీ.. 2022లో సంపద వృద్ధిలో భారత దేశంలోనే మొదటిస్థానంలో నిలిచారు. ప్రపంచ స్థాయి కుబేరుల్లో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ముఖేష్ అంబానీ, బిల్ గేట్స్ లాంటి వారిని  సైతం దాటేసి.. పలు కీలక ప్రాజెక్టులను సైతం సొంతం చేసుకున్నారు. బ్లూమ్‌బర్గ్‌ నివేదిక ప్రకారం.. అదానీ ఈ ఏడాది సంపద విలువ 49 బిలియన్‌ డాలర్ల (రూ.4 లక్షల కోట్లకు పైగా) మేర పెరగింది. తద్వారా సంపద వృద్ధిలో బిల్‌గేట్స్‌, జెఫ్‌ బెజోస్‌, వారెన్‌ బఫెట్‌నూ అదానీ వెనక్కి నెట్టారు. 125.5 బిలియన్‌ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల్లో అదానీ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో అదానీ తన వ్యాపార రంగాన్ని విస్తరించేందుకు కీలక ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. ఈ తరుణంలో భారత వ్యాపార దిగ్గజం అదానీ హైదరాబాద్ నగరంపై కన్నేశారు. ఇప్పటికే పలు రంగాల్లో రాణిస్తున్న అంబానీ.. హైదరాబాద్ లోని ఓఆర్ఆర్ టోల్ ప్రాజెక్టును దక్కించుకునేందుకు సిద్దమయ్యారు. అదానీ రోడ్ ట్రాన్స్‌పోర్ట్, కెనడియన్ ఇన్వెస్టర్లు KKR, NIIF సంస్థలు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (ORR) టోల్ హక్కులను పొందేందుకు రంగంలోకి దిగాయి. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ టోల్ హక్కుల కోసం పలు సంస్థలు పోటీలో ఉండగా.. దీనికోసం అదానీ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కూడా పోటీ పడుతుండటం ఆసక్తి రేపుతోంది. 7,000-8,000 కోట్ల రూపాయల విలువైన ఈ టోల్ డీల్‌ రేసులో పలు ప్రధాన సంస్థలు ఉన్నాయని ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీకి చెందిన హైదరాబాద్ గ్రోత్ కారిడార్ (HGCL) 158 కిలోమీటర్ల పొడవైన నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ (NORR) ను పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో 30 సంవత్సరాల పాటు టోల్, ఆపరేట్, బదిలీ ప్రాతిపదికన నిర్వహించడానికి బిడ్‌లను ఆహ్వానించినట్లు నివేదిక పేర్కొంది.

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ టోల్ హక్కుల ప్రాజెక్టు కోసం.. దాదాపు 12 సంస్థలు ఆసక్తి కలిగి ఉన్నాయి. జనవరి నాటికి బిడ్‌లను సమర్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో కెనడియన్ పెన్షన్ ఫండ్స్ CPP ఇన్వెస్ట్‌మెంట్స్ (CPPIB) అండ్ CDPQ, ఇన్వెస్టర్స్ KKR, క్యూబ్ హైవేస్, నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (NIIF), ఎడల్వీస్ బ్యాకెడ్ సుకెరా రోడ్స్ అండ్ IRB ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్‌లతో పాటు స్ట్రాటజిక్ సోర్స్ ప్లేయర్ అదానీ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ ఉన్నట్లు తెలుస్తోంది.

టోల్ ప్రాజెక్టు బిడ్ సమర్పణకు జనవరి 16, 2023 వరకు గడువు ఉంది. బిడ్‌లు రూ. 7,000-రూ. 8,000 కోట్ల పరిధిలో ఉంటాయని ఒక ఫండ్ మేనేజర్ బిజినెస్ వార్తాపత్రికకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

గచ్చిబౌలి, హైటెక్ సిటీ, నానక్రామ్‌గూడ, కొండాపూర్, శంషాబాద్, నార్సింగితో సహా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానంగా ఉన్నాయి. HGCL ప్రకారం.. జనవరి 24న బిడ్లు పరిశీలన, జనవరి 28న ప్రాజెక్ట్ కేటాయింపు తదితర ప్రక్రియలు ఉంటాయని సమాచారం.

అయితే, ఈ బిడ్ తేదీని పొడిగించే అవకాశం కూడా ఉందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ORRలో 19 యాక్సెస్ పాయింట్లు ఉన్నాయి. ప్రతి పాయింట్ వద్ద ట్రాఫిక్ ఫ్లోపై తగిన శ్రద్ధ వహించడానికి మరింత సమయం అవసరం అని ఫండ్ మేనేజర్ తెలిపారు. అయితే, ఈగిల్ ఇన్‌ఫ్రా ఇండియా 2019 నుంచి టోల్‌ను వసూలు చేసి హెచ్‌ఎండీఏకు పంపుతోందని నివేదిక పేర్కొంది. ఓ ఆర్ ఆర్ టోల్ ప్రాజెక్టు కోసం అగ్ర సంస్థలు ఇండియా హైవే కన్సెషన్ ట్రస్ట్, హైవేస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ ద్వారా బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొంటాయని పేర్కొంటున్నారు. అథాంగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ద్వారా నిర్వహించనున్నారు.

ORR అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 2005లో HGCLని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ 60 శాతం ఈక్విటీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మిగిలిన 40 శాతం వాటాను అందిస్తుంది. ప్రస్తుతం, HGCLలో INCAPకి 26 శాతం, HMDAకి 74 శాతం వాటా ఉందని నివేదిక పేర్కొంది.

ఏప్రిల్‌లో, రేటింగ్ ఏజెన్సీ ICRA FY23 కోసం టోల్ రోడ్ల సెక్టార్‌లో పలు సవరణలు చేసింది. 2023 ఆర్ధిక సంవత్సరంలో టోల్ సేకరణలో ఆరోగ్యకరమైన పెరుగుదలకు, మార్పులకు కారణమవుతుంది. అధిక ద్రవ్యోల్బణం, మెరుగైన ఆర్థిక కార్యకలాపాల నేపథ్యంలో ఆరోగ్యకరమైన టోల్ రేటు పెరుగుదల మద్దతునిస్తుందని నివేదిక పేర్కొంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..