Trending Video: చల్లచల్లని కూల్ కూల్.. బాత్రూంలో స్నానం చేసిన భారీ కింగ్ కోబ్రా.. రియాక్షన్ చూస్తే వణికిపోవాల్సిందే..

పాములు వేసవిలో చల్లని ప్రదేశం.. చల్లని వాతావరణంలో వెచ్చని ప్రదేశం కోసం వెతుకుతుంటాయి. ఎవరూ చూడని ప్రదేశానికి వచ్చి అక్కడే తిష్టవేస్తాయి. ఏది ఏమైనప్పటికీ కింగ్ కోబ్రా..

Trending Video: చల్లచల్లని కూల్ కూల్.. బాత్రూంలో స్నానం చేసిన భారీ కింగ్ కోబ్రా.. రియాక్షన్ చూస్తే వణికిపోవాల్సిందే..
King Cobra
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 14, 2022 | 11:38 AM

పాములు వేసవిలో చల్లని ప్రదేశం.. చల్లని వాతావరణంలో వెచ్చని ప్రదేశం కోసం వెతుకుతుంటాయి. ఎవరూ చూడని ప్రదేశానికి వచ్చి అక్కడే తిష్టవేస్తాయి. ఏది ఏమైనప్పటికీ కింగ్ కోబ్రా.. పాములలో అత్యంత ప్రమాదకరమైన పాము అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఎందుకంటే దాని విషం చాలా ప్రమాదకరమైనది. కింగ్‌ కోబ్రా (తాచుపాము) కాటుకు గురైన కొద్ది నిమిషాల్లో మరణిస్తాడు. కింగ్ కోబ్రా కాటు వేయడం, ముంగిస లేదా.. వేరే పాములతో పొట్లాడటం లాంటి దృశ్యాలను చూసే ఉంటారు. కానీ, దీనికి భిన్నంగా.. ఓ నాగుపాము బాత్రూంలో స్నానం చేసింది. ప్రస్తుతం వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన తర్వాత మీరు కూడా షాకవుతారు.

వైరల్ అవుతోన్న వీడియోలో.. ఓ వ్యక్తి కింగ్ కోబ్రాకు చల్లటి నీటితో స్నానం చేయిస్తున్నాడు. అయితే, పాము అతనిపై దాడి చేయడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఈ షాకింగ్ సన్నివేశాన్ని ఎవరూ నమ్మలేకపోతున్నారు. బాత్రూంలో ఒక పెద్ద కింగ్ కోబ్రాకు ఒక వ్యక్తి.. మగ్గుతో నీళ్లు పోస్తూ స్నానం చేయిస్తున్నాడు. ఈ వీడియో చూస్తుంటే.. తల్లిదండ్రులు తమ బిడ్డకు ఎలా స్నానం చేయిస్తారో.. అలానే ఈ వ్యక్తి కూడా కింగ్ కోబ్రాకు స్నానం చేయిస్తున్నాడు. ఈ వీడియో చూస్తే మీ వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి.. మీరూ ఓ లుక్కెయండి..

కింగ్ కోబ్రా వీడియో చూడండి..

ఒకసారి కింగ్ కోబ్రా పడగవిప్పి.. మగ్గును పట్టుకోవడానికి కూడా ప్రయత్నించింది.. అయితే.. ఆ వ్యక్తి దానిని దూరంగా నెట్టివేసి మరి స్నానం చేయడం కొనసాగించాడు. ఈ వీడియోను @Gulzar_sahab అనే యూజర్‌ ట్విట్టర్ లో షేర్‌ చేయగా.. నెట్టింట వైరల్‌ గా మారింది. ఈ వీడియోను ఇప్పటి వరకు వేలాది మంది వీక్షించి పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. బహుశా నాగుపాము పెంచుకునేది అయి ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే, మరికొంతమంది పాములతో జాగ్రత్త ఉండాలంటూ సూచిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం..