మనలోని చిన్నపిల్లవాడిని ఎప్పటికీ చావనివ్వకూడదని మన పెద్దలు చెబుతుంటారు. ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలోని ముగ్గురికీ కూడా వారి పెద్దవాళ్లు ఇదే మాటను బాగా చెప్పి ఉంటారు. అందుకే నడి వయసులో కూడా చిన్నతనంలో ఆడినట్లుగా రోడ్డు మీద షర్ట్ తీసేసి మరి నీళ్లల్లో ఆడుకుంటున్నారు. అంతేనా రోడ్డు మీద ఉన్న నీళ్లపై కార్లు వెళ్తున్నప్పుడు ఆ నీళ్లు తమపై పడడాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇంకా రోడ్డు మీదుగా వెళ్లే కార్లను తమపై నీళ్లు పడేలా నడపమని సైగలు చేస్తున్నారు. ఇంకా తమపై నీళ్లు చల్లేందుకు కార్లు రావాలన్నట్లుగా రోడ్డు మీద ఎదురు చూస్తున్నారు.
‘డంకన్ కుకార్డ్’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ అయిన ఈ వీడియోలో ఒక అమ్మాయితో పాటు నల్లటి షార్ట్‌లు ధరించిన ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై నిలబడి ఉన్నారు. వారు కార్లను. ‘స్ప్లిష్ స్ప్లాష్’ బాబీ డారిన్ అనే పాటతో వచ్చిన ఈ వీడియోను ఎక్కడ చిత్రీకరించారనేది ఇంకా తెలియరాలేదు. నవంబర్ 20న పోస్ట్ అయిన ఈ వీడియోను ఇప్పటి వరకూ కోటి 80 లక్షల మంది విక్షించారు. ఇంకా ఎనిమిది లక్షలకు పైగా లైక్స్ కూడా వచ్చాయి.
నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
View this post on Instagram
అంతేకాక ఈ వీడియోకు నెటిజన్లు కూడా ఎంతో సానుకూలంగా స్పందిస్తున్నారు. ఓ నెటిజన్ అయితే ‘ఎలా ఆనందించాలో బాగా తెలిసినవారు’ అని కామెంట్ చేశాడు. ‘ఈ మధ్య నేను చూసిన గొప్ప వీడియో ఇదే’ అని మరో నెటిజన్ వీడియోకు రిప్లై ఇచ్చాడు. ‘అది స్వచ్ఛమైన నీరు అయితే మరింత సరదాగా ఉంటుంది’ అని రాసుకొచ్చాడు. ఇలా చాలా మంది నెటిజన్లు తమ తమ స్పందనలను కామెంట్ల రూపంలో వ్యక్తం చేసి.. వీడియోలోని వారిని అభినందిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం..