Charmy Kaur: పంటపొలాల్లో సందడి చేస్తున్న అందాల భామ చార్మి.. ‘అలా చూడకు’ అంటూ హోయలు పోతూ..

తెలుగు రాష్ట్రాల్లో నయా ట్రెండ్‌ నడుస్తోంది. అందమైన తారలు పొలంబాట పడుతున్నారు. మొన్న పంటచేలల్లో శృంగార తార సన్నిలియోన్‌ సందడి చేస్తే.. తాజాగా చార్మి ఓ మిరపచేనులో కావలి కాస్తుంది.

Charmy Kaur: పంటపొలాల్లో సందడి చేస్తున్న అందాల భామ చార్మి.. ‘అలా చూడకు’ అంటూ హోయలు పోతూ..
Charmy Kaur
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 14, 2022 | 12:45 PM

తెలుగు రాష్ట్రాల్లో నయా ట్రెండ్‌ నడుస్తోంది. అందమైన తారలు పొలంబాట పడుతున్నారు. మొన్న పంటచేలల్లో శృంగార తార సన్నిలియోన్‌ సందడి చేస్తే.. తాజాగా చార్మి ఓ మిరపచేనులో కావలి కాస్తుంది. సన్నిలియోన్‌, చార్మి ఏంటీ పొలానికి పోవడమేంటి అనే కదా మీ డౌటనుమానం. మహబూబాబాద్‌ జిల్లాలోని ఓ రైతు ఆలోచన చూస్తే మీకే అర్థమవుతుంది.

బాగా ఏపుగా పెరిగిన పంటకు దిష్టి తగలకుండా రైతులు దిష్టిబొమ్మలు పెట్టడం చూస్తుంటాం. అయితే మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం భవానీగడ్డ రైతు మాత్రం ఈ దిష్టికి కాస్త అభిమానాన్ని జోడించాడు. మిర్చీ చేనులో దిష్టి బొమ్మకు బదులు తన అభిమాన నటి ఛార్మి ఫ్లెక్సీని పెట్టాడు. చార్మింగ్‌ డాల్‌ మిర్చీ చేనుకి దిష్టిచుక్కగా మారిపోయింది. దీంతో చేనుని చూసేకళ్ళన్ని ఛార్మి అందాలని చూస్తూ ఆగిపోతున్నాయి.

భూక్యా అచ్చు అనే రైతు తన రెండు ఎకరాలలో ఎకరం పత్తి, మరో ఎకరం మిర్చి పంటను సాగు చేశాడు. తన పంటకు దిష్టి తగలకుండా ఛార్మి ఫ్లెక్సీని తన పంటపొలంలో ఏర్పాటు చేశాడు. ఇలా ఛార్మిని చూసుకుంటూ పంటపండించడం,దిగుబడి రావడం తనకు చాలా ఆనందంగా ఉందంటున్నాడు భూక్యా. మొత్తానికి రైతు చేసిన పనికి పంట దిష్టేమోగానీ ఛార్మీ అభిమానులు మాత్రం ఫుల్‌ హర్టవుతున్నారు.

ఇవి కూడా చదవండి

పంటపొలాల్లో చార్మీ.. వీడియోలో చూడొచ్చు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..