OU Cancelled Detention System: డిటెన్షన్ విధానాన్ని రద్దు చేసిన ఉస్మానియా వర్సిటీ.. వారికి భారీ ప్రయోజనం..
తెలంగాణ రాష్ట్రం ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఇంజినీరింగ్ కోర్సుల్లో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేయవల్సిందిగా వేల మంది విద్యార్ధులు మంగళవారం (డిసెంబర్ 13) పెద్ద ఎత్తున డిమాండ్ చేసిన సంగతి..
తెలంగాణ రాష్ట్రం ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఇంజినీరింగ్ కోర్సుల్లో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేయవల్సిందిగా వేల మంది విద్యార్ధులు మంగళవారం (డిసెంబర్ 13) పెద్ద ఎత్తున డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే ప్రస్తుతం ఉన్న క్రెడిట్ సిస్టం వల్ల తదుపరి కోర్సులు చదవలేకపోతున్నామని, డిటెన్షన్ వల్ల తమకు అన్యాయం జరుగుతోందని వాపోయారు. కరోనా కాలంలో తరగతులు సకాలంలో జరగలేదని, దీంతో అనేక మంది ఉత్తీర్ణత కాలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విద్యాసంవత్సరంలో దాదాపు 3184 మంది విద్యార్థుల డిటెన్షన్ వల్ల తదుపరి కోర్సులు చదవలేకపోతున్నారని, ఏడాది కాలం వృథా అవుతుందని వాపోయారు. దీనిపై స్పందించిన ఓయూ అధికారులు 2022-23 విద్యాసంవత్సరంలో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఐతే ఒక సంవత్సరం మాత్రమే డిటెన్షన్ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.
ఇంజనీరింగ్ క్రెడిట్ సిస్టం ప్రకారం.. ఇంజనీరింగ్ విద్యార్ధులు తమకు కేటాయించిన మొత్తం క్రెడిట్ మార్కుల్లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. అంతకంటే తక్కువ మార్కులు వచ్చిన విద్యార్ధులను యూనివర్సిటీ నిబంధనల ప్రకారం డిటైన్ చేస్తారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.