Nellore: సిసలైన జాతిరత్నాలు..! 800 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తే 5,360 మార్కులు సాధించిన విద్యార్ధులు

ఆంధ్రప్రదేశ్‌ డిగ్రీ పరీక్షల ఫలితాల్లో మునుపెన్నడూ చూడనిరీతిలో వింతలు చోటుచేసుకుంటున్నాయి. ఎక్కడైనా అసలు మార్కులకంటే తక్కువ రావడం పరిపాటి. విక్రమ సింహపురి యూనివర్సిటీ విద్యార్ధులకు మాత్రం అసలు కంటే..

Nellore: సిసలైన జాతిరత్నాలు..! 800 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తే 5,360 మార్కులు సాధించిన విద్యార్ధులు
Nellore VSU
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 14, 2022 | 9:00 AM

ఆంధ్రప్రదేశ్‌ డిగ్రీ పరీక్షల ఫలితాల్లో మునుపెన్నడూ చూడనిరీతిలో వింతలు చోటుచేసుకుంటున్నాయి. ఎక్కడైనా అసలు మార్కులకంటే తక్కువ రావడం పరిపాటి. విక్రమ సింహపురి యూనివర్సిటీ విద్యార్ధులకు మాత్రం అసలు కంటే వేలకు వేలు మార్కులొచ్చాయి. వివరాల్లోకెళ్తే..

నెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీలో ఇటీవల డిగ్రీ విద్యార్ధులకు 800 మార్కులకు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కొంత మంది విద్యార్ధులకు ఏకంగా 2 వేలకు పైగా మార్కులు వచ్చాయి. ఈ యూనివర్సిటీలో మాత్రం విరుద్ధంగా మూడు రెట్లు అధికంగా మార్కులు రావడంతో విద్యార్ధులు అయోమయానికి గురవుతున్నారు. ఒక విద్యార్ధికైతే 5,360 మార్కులు వచ్చాయి. తాము అసలు పాసైయ్యామో, ఫెయిల్‌ అయ్యామో తెలీక విద్యార్ధులు తలలు పట్టుకుంటున్నారు. 8 నెలల క్రితం విక్రమ సింహపురి యూనివర్సిటీలో జరిగిన డిగ్రీ నాలుగో సెమిస్టర్‌ పరీక్షల ఫలితాలు తాజాగా విడుదలవ్వడంతో ఈ వింత వెలుగు చూసింది. ఫలితాలు ఆలస్యంగా వెల్లడించినప్పటికీ ఈ తప్పులేంటని విద్యార్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతోమంది విద్యార్థులకు ఈ విధంగానే మార్కులు వచ్చాయి. దీనిపై యూవర్సిటీ రిజిస్ట్రార్‌ రామచంద్రారెడ్డి స్పందిస్తూ.. మార్కుల జాబితాల్లో తప్పులుంటే సవరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!