AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NHPC Ltd: నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో అప్రెంటిస్‌ ఖాళీలు.. అకడమిక్‌ మెరిట్‌ ద్వారా ఎంపిక..

భారత ప్రభుత్వరంగానికి చెందిన నవరత్న సంస్థ అయిన చెన్నైలోని నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌.. 80 అప్రెంటిస్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల.

NHPC Ltd: నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో అప్రెంటిస్‌ ఖాళీలు.. అకడమిక్‌ మెరిట్‌ ద్వారా ఎంపిక..
NHPC Limited
Srilakshmi C
|

Updated on: Dec 14, 2022 | 7:45 AM

Share

భారత ప్రభుత్వరంగానికి చెందిన నవరత్న సంస్థ అయిన చెన్నైలోని నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌.. 80 అప్రెంటిస్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డ్రాఫ్ట్‌మ్యాన్‌ (సివిల్‌), డ్రాఫ్ట్‌మ్యాన్‌ (మెకానికల్‌), కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌, సెక్రటేరియల్‌ అసిస్టెంట్‌, స్టెనోగ్రాఫర్‌ (హిందీ), హెల్త్‌ శానిటరీ ఇన్స్‌పెక్టర్‌ టేడ్రుల్లో ఖాళీలను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఇప్పటికే పాస్‌ అయిన 2019, 2022, 2021, 2022 ఐటీఐ బ్యాచ్‌లకు చెందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారు అనర్హులు. దరఖాస్తుదారుల వయసు డిసెంబర్‌ 12, 2022వ తేదీనాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 31, 2022వ తేదీలోపు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఆ తర్వాత నింపిన దరఖాస్తులను డౌన్‌లోడ్‌ చేసుకుని కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా జనవరి 10, 2023వ తేదీలోపు పంపించాలి. అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఏడాదిపాటు కొనసాగే ట్రైనింగ్‌ పిరియడ్‌లో అప్రెంటిస్‌ రూల్స్‌ ప్రకారం ప్రతినెల స్టైపెండ్ చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్..

Sr. Manager(HR)-Rectt., Recruitment Section, NHPC Office Complex, Sector-33, Faridabad, Haryana – 121003

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.