Crime News: బరి తెగించిన దొంగల ముఠా! ఏకంగా కరెంట్‌ ట్రాన్ఫార్మర్లనే ఎత్తుకెళ్లారు..

బిహార్‌లో దొంగల బెడద పెరిగిపోతోంది. తాజాగా ఓ దొంగల ముఠా ఏకంగా విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్లనే ఎత్తుకెళ్లారు. వివరాల్లోకెళ్తే..

Crime News: బరి తెగించిన దొంగల ముఠా! ఏకంగా కరెంట్‌ ట్రాన్ఫార్మర్లనే ఎత్తుకెళ్లారు..
Thieves Stolen Transformers
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 13, 2022 | 11:46 AM

బిహార్‌లో దొంగల బెడద పెరిగిపోతోంది. తాజాగా ఓ దొంగల ముఠా ఏకంగా విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్లనే ఎత్తుకెళ్లారు. బిహార్‌ రాష్ట్రంలోని సీవాన్‌ జిల్లాలోని రఘునాథ్‌పుర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకెళ్తే.. సీవాన్‌ జిల్లాలోని రఘునాథ్‌పుర్‌ బాజా, పాంజ్‌వార్‌, అగ్రికల్చరల్‌ ఫాం, అమ్వారీ, మురార్‌పట్టి.. అనే 5 గ్రామాల్లో ఆదివారం (డిసెంబర్‌ 11) రాత్రి దొంగలు అయిదు ట్రాన్స్‌ఫార్మర్లను దొంగతనం చేశారు. దీంతో ఆ ఐదు గ్రామాల్లో కరెంట్‌లేక ప్రజలు నానా ఆగచాట్లు పడ్డారు. సోమవారం ఉదయం ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు ట్రాన్స్‌ఫార్మర్లను దొంగలెత్తుకెళ్లినట్టు గమనించారు. ఈ విషయమై సమీపంలోని పోలీసులకు సమాచారం అందించారు.

తక్షణమే స్పందించిన ఆ రాష్ట్ర విద్యుత్‌శాఖ అధికారులు16 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్లను తిరిగి ఏర్పాటు చేశారు. దీంతో ఆ అయిదు గ్రామాల్లో తిరిగి కరెంట్‌ సప్లై అయ్యింది. చీకట్లో తమ గ్రామాలను దోచుకునేందుకే దుండగులు ట్రాన్స్‌ఫార్మర్లను అపహరించి ఉంటారని గ్రామస్థులు అంటున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల దొంగలను వీలైనంత త్వరగా పట్టుకుని తమకు రక్షన కల్పించవల్సిందిగా పోలీసులను కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.