AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Union budget 2023-24: నిర్మలమ్మ కరుణిస్తుందా.? కేంద్ర బడ్జెట్ పై సామాన్యుల ఆశలు..

కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటో తేదీన 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన భారత్ బడ్జెట్ ను పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Union budget 2023-24: నిర్మలమ్మ కరుణిస్తుందా.? కేంద్ర బడ్జెట్ పై సామాన్యుల ఆశలు..
Tax Deduction Expectations In Upcoming Inion Budget 2023 24
TV9 Telugu Digital Desk
| Edited By: Anil kumar poka|

Updated on: Jan 02, 2023 | 5:46 PM

Share

బడ్జెట్ సమయం ఆసన్నమైంది. ఏటా మాదిరిగానే సగటు మనిషి కేంద్రం వైపు ఆశగా చూస్తున్నాడు. ఈ సారైనా పన్నుల భారాన్ని తగ్గిస్తారా అని పద్దుల మంత్రి నిర్మలమ్మ వైపు ఆతృతగా ఎదురుచూస్తున్నాడు.కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటో తేదీన 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన భారత్ బడ్జెట్ ను పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మరో ఏడాదిన్నరలో సార్వత్రిక ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వానికి ఇదే పూర్తి స్థాయి బడ్జెట్ కానుంది. ఈ నేపథ్యంలో సామాన్యుల దగ్గర నుంచి నిపుణుల వరకూ అందరూ ఎంతో ఆసక్తి గా బడ్జెట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సారైనా వ్యక్తిగత పన్ను చెల్లింపు దారులకు శుభవార్త చెబుతుందో లేదో వేచి చూడాలి. ఒకవేళ పన్ను మినహాయింపులు ఇస్తే ఏ విధంగా ఇస్తారు అనే దానిపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ఈ దరిమిలా నిపుణులు మూడు ప్రధాన మార్గాలలో పన్నుల భారం తగ్గించేందుకు అవకాశం ఉందని అంచనావేస్తున్నారు. అవేంటో ఓ సారి చూద్దాం.

పన్ను స్లాబ్లను సవరించడం ద్వారా.. ఆదాయపు పన్ను స్లాబ్ లను సవరించడం ద్వారా వ్యక్తిగత పన్ను భారాన్ని తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. వ్యక్తి గత పన్ను చెల్లించే 60 ఏళ్ల లోపు వారికి ప్రస్తుతం వార్షిక ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి రూ. 2.5 లక్షలుగా ఉంది. ఇది 2015 నుంచి అలాగే ఉండి పోయింది. ఈ పరిమితిని రూ. 5లక్షలకు పెంచితే బాగుంటుందని సూచిస్తున్నారు. అలాగే ఆదాయం 20 లక్షల వ రకు ఉన్న ఆదాయపు పన్న స్లాబ్ రేట్లను కూడా తగ్గించాలని చెబుతున్నారు. అత్యధిక పన్ను రేటు ప్రస్తుత 30 శాతం ఉంది. ఇది కూడా 2017 నుంచి మారలేదు. దీనిని కూడా 25 శాతానికి తగ్గిస్తారన్న అంచనా వేస్తున్నారు. దీనిని తగ్గించడ వల్ల వ్యక్తుల కొనుగోలుశక్తి పెరిగే అవకాశం ఉంది. అలాగే అత్యధిక పన్ను రేటు వసూలు చేసే థ్రెస్ హోల్డ్ పరిమితి కూడా రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు మార్చుతారని అంచనా వేస్తున్నారు.

సెక్షన్ 80సీలో సవరణలు.. గత కొన్నేళ్లుగా ప్రాథమిక వస్తువుల ధర గణనీయంగా పెరిగినందున హోమ్ లోన్పై విధించే పన్ను పరిమితులను కూడా సవరించాలని నిపుణులు సూచిస్తున్నారు. అందుకోసం సెక్షన్ 80సీ మార్పులు అవసరమని చెబుతున్నారు. ప్రస్తుతం సెక్షన్ 80సీ పరిమితి రూ. 1.5 లక్షలుగా ఉంది. దీనిని రూ. 2.5 లక్షలకు పెంచాలని సూచిస్తున్నారు. అలాగే స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి ఏడాదికి రూ. 50,000 నుంచి రూ. 1లక్షకు పెంచాలని అని చెబుతున్నారు. వ్యక్తుల పొదుపు, వ్యయాలు, దీర్ఘకాలిక పెట్టుబడులను ప్రోత్సహించే విధంగా 6 ఏ కింద పరిమితులు కూడా పెంచాలని సూచించారు.

రాయితీలను అందించాలి.. 2020 బడ్జెట్లో ప్రవేశపెట్టిన కొత్త పన్ను రాయితీ విధానం కొన్ని ప్రయోజనకరమైన పన్ను రేట్లు అమలు చేసినప్పటికీ.. దానిని చెల్లింపు దారులు పెద్దగా వినియోగించుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో మరికొన్ని పన్ను మినహాయింపులు అనుమతిండచం ద్వారా కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చవచ్చని సూచిస్తున్నారు.