Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2023: ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం చిన్నచూపు చూస్తోందా? బడ్జెట్ కేటాయింపులపై సర్వత్రా ఆసక్తి

గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ఆర్థిక సంవత్సరంలో పనిదినాలు పెద్ద ఎత్తున తగ్గడమే ఇందుకు నిదర్శనంగా కేంద్ర ప్రభుత్వం చూపిస్తోంది.

Budget 2023: ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం చిన్నచూపు చూస్తోందా? బడ్జెట్ కేటాయింపులపై సర్వత్రా ఆసక్తి
Workers
Follow us
Madhu

| Edited By: Anil kumar poka

Updated on: Jan 03, 2023 | 2:28 PM

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్ఆర్ఈజీఎస్) కు డిమాండ్ పడిపోతోందా? గ్రామీణులు ఈ పథకం కింద లబ్ధి పోందేందుకు ఆసక్తి చూపడం లేదా? పట్టణ ప్రాంతాల్లో దొరుకుతున్న మెరుగైన ఉపాధి, మెరుగైన వేతనం నేపథ్యంలో దీనిపై ఆసక్తి సన్నగిల్లుతోందా? అంటే కేంద్ర ప్రభుత్వం అవుననే సమాధానమే ఇస్తోంది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ఆర్థిక సంవత్సరంలో పనిదినాలు పెద్ద ఎత్తున తగ్గడమే ఇందుకు నిదర్శనంగా చూపిస్తోంది. దీనికి సంబంధించి ఇటీవల పార్లమెంట్ లో జరిగిన చర్చలో కేంద్ర ఆర్థిక మంత్రి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు తెలుసుకుందాం..

ఏమిటీ పథకం..

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని(ఎంజీఎన్ఆర్ఈజీఎస్) 2005లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేని వారికి ఒక ఏడాదిలో కనీసం 100 రోజుల పని కల్పించాలన్న లక్ష్యంతో పథకాన్ని అమలు చేసింది. ఈ పథకంలో రోడ్ల నిర్మాణం, బావుల తవ్వకం, కాలువల నిర్మాణం, పూడికతీత వంటి పనులు చేయిస్తుంటారు.

పడిపోతున్న డిమాండ్..

ఉపాధి హామీ పథకానికి రానురానూ డిమాండ్ పడిపోతోంది. అందుకు ప్రధాన కారణం పట్టణాల్లో ఇంతకన్నా మంచి పని, మంచి వేతనం లభిస్తుండటమే. వాస్తవానికి కరోనా పాన్ డెమిక్ సమయంలో లాక్ డౌన్ పరిణామాల కారణంగా చాలా మంది వలస కార్మికులు తమ సొంతూళ్లకు వెళ్లి పోయారు. దీంతో ఆ సమయంలో ఉపాధి పథకం వారికి చాలా తోడ్పాటునందించింది. అప్పుడు గణనీయంగా పని దినాలు నమోదయ్యాయి. అయితే పరిస్థితులు సాధారణ స్థితికి రావడంలో మళ్లీ అందరూ పట్నం వచ్చి ఇతర పనులు చేసుకుంటున్నారు. ఫలితంగా ఉపాధి పనులకు డిమాండ్ గణనీయంగా తగ్గింది.

ఇవి కూడా చదవండి

ఇవిగో లెక్కలు..

ఉపాధి హామీ పథకానికి 2022-23 ఆర్థిక సంవత్సరంలో డిమాండ్ బాగా పడిపోయింది. ఫలితంగా ఆ పథకానికి నగదు మంజూరు కూడా తగ్గింది. ఉపాధి హామీ పథకం వెబ్ సైట్ ఆధారంగా గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే దాదాపు 33 శాతం తగ్గుదల కనిపించింది. అంటే గతేడాది బడ్జెట్ కేటాయింపు రూ. 96,812 కోట్లు కాగా.. అది ఈ ఏడాది రూ. 73,000 కోట్లకే పరిమితం అయ్యింది. గత ఆర్థిక సంవత్సరంలో 3.63 బిలియన్ల పనిదినాలు కల్పించగా.. 2023 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ 2.12 బిలయన్లకు పడిపోయింది.

ఆర్థిక మంత్రి ఏమన్నారు?

దీనిపై గత వారంలో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ అత్యంత ప్రజాదరణ పొందిన ఉపాధి హామీ పథకానికి ఇటీవల డిమాండ్ తగ్గిందని స్పష్టం చేశారు. గత ఆర్థిక సంవత్సరం కల్పించిన పని దినాలను ఈ ఆర్థిక సంవత్సరం మొదటి భాగంతో పోల్చి చూస్తే దాదాపు 18 శాతం తగ్గుదల కనిపించిందన్నారు. అంటే 2.10 బిలియన్ల పనిదినాలు గతేడాది ఫస్ట్ హాఫ్ లో కల్పిస్తే.. అది ఈ ఏడాది 1.72 బిలియన్లకి చేరిందని వివరించారు. దీంతో వచ్చే ఏడాదికి ఈ పథకానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు ఈ డిమాండ్ కు అనుగణంగానే ఉంటాయన్నట్లు సూచన ప్రాయంగా తెలియజేసినట్లయ్యింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..