Taj Mahal: వింతల్లో వింత గురూ.. తాజ్‌మహల్‌కు ఇంటి పన్ను బకాయి చెల్లించాలంటూ నోటీసులు
ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచినది ఆగ్రాలోని తాజ్‌మహల్. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో ఉంది. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌కు ఇప్పుడు ఓ ఆశ్చర్యకరమైన..
ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచినది ఆగ్రాలోని తాజ్‌మహల్. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో ఉంది. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌కు ఇప్పుడు ఓ ఆశ్చర్యకరమైన నోటీసు వచ్చింది. అదేంటంటే.. తాజ్‌మహల్‌కు ఇంటి పన్ను బకాయిలను చెల్లించాలంటూ ఆగ్రాలోని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ)కి నోటీసులు జారీ చేశారు. తాజ్‌మహల్‌పై రూ.1.4 లక్షల ఇంటి పన్ను ఉందని, దానిని వెంటనే చెల్లించాలని నోటీసులలో పేర్కొన్నారు. అయితే ఈ ఇంటి పన్ను బకాయిలను క్లియర్ చేసేందుకు 15 రోజుల గడువు ఇచ్చారు. గడువులోగా పన్ను చెల్లించకుంటే తాజ్‌మహల్‌ను అటాచ్ చేస్తామని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసు గత నెల నవంబర్ 25న జారీ చేయగా, ఇటీవల ఏఎస్ఐకి వచ్చింది. అలాగే తాజ్‌మహల్‌తో పాటు యమునా నదికి అనుకుని ఉన్న స్మారక చిహ్నం ఎత్మాద్-ఉద్-దౌలాకు కూడా నోటీసులు జారీ చేశారు మున్సిపల్ అధికారులు.
అయితే మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులపై ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బ్రిటీష్ హయాం నుంచి ఇప్పటి వరకు పన్ను కట్టమని ఎప్పుడు కూడా నోటీసులు పంపించలేదని, ఇలా నోటీసులు పంపడం తొలిసారి అంటూ వాపోయారు. ఇది విచిత్రంగా ఉందంటున్నారు. అలాగే ఇంటి పన్ను మొత్తంలో బకాయిపై వడ్డీగా రూ.47,943 కూడా చేర్చారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి ఇంటి పన్ను రూ.11,098 అని పేర్కొన్నారు. తాజ్‌మహల్‌ను రక్షిత స్మారక చిహ్నంగా ప్రకటించారని, అందుకే ఈ పన్ను విధించారేమోనని ఏఎస్‌ఐ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
మరో స్మారక చిహ్నానికి నోటీసులు
మరోవైపు ఆగ్రాలోని మొఘల్ సమాధి అయిన టోంబో ఆఫ్ ఇత్మాద్-ఉద్-దౌలాపై కూడా పన్ను బకాయి నోటీసును సైతం జారీ చేశారు మున్సిపల్ అధికారులు. ఈ సమాధిని ‘బేబీ తాజ్’ అని కూడా పిలుస్తారు. ఈ సమాధిని మొఘల్ చక్రవర్తి జహంగీర్ భార్య నూర్జహాన్ తన తండ్రి కోసం నిర్మించారు.
జాతీయ స్మారక చిహ్నాలపై పన్ను విధించడానికి వీల్లేదు:
అలాగే జాతీయ స్మారక చిహ్నాలపై ఎలాంటి పన్ను విధించేందుకు వీలుండదని, ఆగ్రాలోని మున్సిపల్ అధికారులు పొరపాటున ఈ పన్ను నోటీసులు పంపి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ పన్ను బాధ్యతలు ఆగ్రాలోని ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించారని, పొరపాటున ఇలా నోటీసులు వచ్చి ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఏదీ ఏమైనా తాజ్‌మహల్ నిర్మించి ఇన్నేళ్లు అవుతున్నా.. ఇప్పటి వరకు రాని నోటీసులు అప్పుడు రావడం ఆశ్చర్యకరం కలిగిస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి