ఆ విషయం లో ధురంధర్‌ను ఫాలో అవుతున్న Jr. ఎన్టీఆర్
ప్రశాంత్ నీల్-జూనియర్ ఎన్టీఆర్ సినిమాపై ఆసక్తికర వార్త! ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుందని, నీల్ ధురంధర్ తరహాలో వేగంగా రెండవ భాగాన్ని విడుదల చేయాలని యోచిస్తున్నారని తెలుస్తోంది. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే పార్ట్ 2 రిలీజ్ చేసి, ప్రేక్షకులను ఉత్సాహపరచాలని నీల్ భావిస్తున్నారు. తారక్ బరువు తగ్గి మేకోవర్ అయ్యారు.
జూనియర్ ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ నీల్ ధురంధర్ రూట్ ఫాలో అవుతున్నారా..? ఎక్కడి ధురంధర్.. ఎక్కడి తారక్ సినిమా.. వీటికి పోలికెక్కడుంది అనుకుంటున్నారు కదా..? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఆ ఒక్క విషయంలో ధురంధర్ రూట్ అయితేనే సెట్టవుతుందని నీల్ గట్టిగా నమ్ముతున్నారు. మరి ఆయన్నంతగా ఇన్‌స్పైర్ చేసిందేంటో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా..? వార్ 2 ఫలితం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తన ఫోకస్ అంతా నీల్ సినిమాపైనే పెట్టారు. ఈ చిత్రం కోసం చాలా మేకోవర్ అయ్యారు తారక్. అసలు గుర్తు కూడా పట్టలేనంతగా బరువు తగ్గిపోయారు. మామూలుగా తన హీరోలను లావుగానే చూపించే ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్‌ను మాత్రమే ఎందుకో బాగా సన్నగా మార్చేసారు. కొన్ని రోజులుగా జూనియర్ ఎన్టీఆర్, నీల్ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. జనవరి రెండో వారం వరకు అక్కడే యాక్షన్ సీక్వెన్సులు ప్లాన్ చేస్తున్నారు నీల్. దీంతో మేజర్ యాక్షన్ పార్ట్ అయిపోతుందని తెలుస్తుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ బయటికొచ్చింది. ఈ సినిమా సింగిల్ పార్ట్ కాదని.. దేవర తరహాలోనే రెండు భాగాలుగా రానుందని ప్రచారం జరుగుతుంది. ప్రశాంత్ నీల్ సైతం తన గత సినిమాలైన కేజియఫ్, సలార్‌లను 2 పార్ట్స్‌గానే డిజైన్ చేసారు. ఇందులో కేజియఫ్ సంచలనం దేశమంతా చూసింది.. నెక్ట్స్ సలార్ 2 కూడా లైన్‌లోనే ఉంది. కాకపోతే తారక్ సినిమా విషయంలో సలార్, కేజియఫ్ సీక్వెల్స్ మాదిరి లేట్ చేయకుండా.. ధురంధర్ రూట్ ఫాలో అవుతున్నారు. ఫస్ట్ పార్ట్ వచ్చిన ఆర్నెళ్లలోపే రెండో భాగం విడుదల చేయాలని చూస్తున్నారు. ధురంధర్ తాజాగా 1000 కోట్ల క్లబ్బులో చేరింది.. ఈ క్రేజ్ ఇలా ఉండగానే 2026, మార్చి 19న పార్ట్ 2 రానుంది. సేమ్ ఫార్ములా తారక్ సినిమాకు అప్లై చేయాలని చూస్తున్నారు నీల్. కుదిర్తే 2026లో ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేసి.. 2027 ఫస్టాఫ్‌లోనే 2వ భాగం రిలీజ్ చేయాలని చూస్తున్నారు. కల్కి 2, ఓజి 2, దేవర 2 లాంటి సీక్వెల్స్ కూడా ఏళ్లకేళ్లు తీసుకోకుండా వెంటనే చేస్తే బాగుంటుందేమో..?
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jailer 02: జైలర్ సీక్వెల్‌లో బాలీవుడ్ స్టార్ హీరో.. గెట్ రెడీ బాయ్స్
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
టీని రెండోసారి వేడి చేసి తాగుతున్నారా ?? మీ బాడీ షెడ్డుకే
విద్యుత్ స్తంభం ఎక్కిన ఎమ్మెల్యే.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

