AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం

ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం

Phani CH
|

Updated on: Dec 28, 2025 | 5:53 PM

Share

లక్నోలో వాజ్‌పేయి 101వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ 'రాష్ట్ర ప్రేరణ స్థల్' ప్రారంభించారు. అయితే, కార్యక్రమం ముగిసిన కొద్ది గంటల్లోనే రోడ్ల అలంకరణ కోసం పెట్టిన 4,000కు పైగా పూల కుండీలను, మోదీ-యోగి కటౌట్‌లను స్థానికులు దొంగిలించారు. ఇది పౌరుల బాధ్యతారాహిత్యంపై తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

మాజీ ప్రధాని వాజ్‌పేయి 101వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ లక్నోలో ‘రాష్ట్ర ప్రేరణ స్థల్’ ప్రారంభించారు. అయితే కార్యక్రమం ముగిసి ప్రధాని అక్కడి నుంచి వెళ్లిన కొద్ది గంటల్లోనే.. రోడ్ల అలంకరణ కోసం ఏర్పాటు చేసిన పూల కుండీలను స్థానికులు ఎత్తుకెళ్లారు. లక్నో డెవలప్‌మెంట్ సమాచారం ప్రకారం.. రోడ్ల వెంబడి అలంకరించిన 4,000 కంటే ఎక్కువ పూల కుండీలను జనం దొంగిలించారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కొందరు తమ బైక్‌లు స్కూటర్లపై కుండీలను పెట్టుకుని వెళ్తుండగా.. మరికొందరు కాలినడకన ఒకటి కంటే ఎక్కువ కుండీలను మోసుకెళ్తూ కనిపించారు. విచిత్రం ఏంటంటే.. కుండీలే కాకుండా మోదీ, యోగి కటౌట్లను కూడా వదలకుండా జనం తీసుకెళ్లారు. ‘రాష్ట్ర ప్రేరణ స్థల్’ ను 65 ఎకరాల స్థలంలో 230 కోట్ల ఖర్చుతో నిర్మించారు. ఇందులో వాజ్‌పేయితో పాటు శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్‌ కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేశారు. 98,000 చదరపు అడుగుల్లో ‘తామర పువ్వు’ ఆకారంలో అద్భుత మ్యూజియంను కూడా నిర్మించారు. లక్నో లోక్‌సభ స్థానం నుంచి ఐదుసార్లు వరుసగా గెలిచిన వాజ్‌పేయికి ఈ ప్రాజెక్ట్ ఒక గొప్ప నివాళి. మూడుసార్లు ప్రధానిగా పని చేసి, పూర్తి ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసిన మొదటి కాంగ్రెసేతర నాయకుడిగా ఆయన చరిత్ర సృష్టించారు. అలాంటిది క్రమశిక్షణ పాటించాల్సిన జనం ఇలా పూల కుండీల కోసం ఎగబడటం పట్ల విమర్శలు వస్తున్నాయి. పౌరుల్లో కనీస బాధ్యత లేకపోవడమే ఈ తరహా ఘటనలకు కారణమని నెటిజన్లు మండిపడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టీని రెండోసారి వేడి చేసి తాగుతున్నారా ?? మీ బాడీ షెడ్డుకే

విద్యుత్‌ స్తంభం ఎక్కిన ఎమ్మెల్యే.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు

Samantha: ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను

Gmail: గుడ్‌ న్యూస్‌.. మీ మెయిల్‌ ఐడీని మార్చుకోవచ్చు.. ఈ విధంగా

క్రిస్మస్‌ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత