RBI: కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దు.. ఆ సంస్థలకు ఆర్బీఐ కీలక ఆదేశాలు

ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, ఇతర చెల్లింపుల సంస్థలపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కీలక ఆదేశాలు జారీ చేస్తుంటుంది. ఆర్బీఐ ఆదేశాలకనుగుణంగా సంస్థలు..

RBI: కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దు.. ఆ సంస్థలకు ఆర్బీఐ కీలక ఆదేశాలు
RBI
Follow us
Subhash Goud

|

Updated on: Dec 19, 2022 | 5:57 PM

ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, ఇతర చెల్లింపుల సంస్థలపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కీలక ఆదేశాలు జారీ చేస్తుంటుంది. ఆర్బీఐ ఆదేశాలకనుగుణంగా సంస్థలు నడుచుకోవాల్సి ఉంటుంది. లేకపోతే చర్యలు చేపడుతుంటుంది. అయితే పేమెంట్‌ ప్రాసెసింగ్‌ బిజినెస్‌ కోసం కొత్త కస్టమర్లను తీసుకోవద్దని, తాత్కాలికంగా ఆపేయాలని రేజర్‌పే, క్యాష్‌ఫ్రీలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఇది తాత్కాలికమైన చర్యలేనని, దీని వల్ల వ్యాపార కార్యకలాపాలపై, వ్యాపారులపై ఎలాంటి చెడు ప్రభావం ఉండదని రేజర్‌పే చెబుతోంది. అయితే ఈ ఆర్బీఐ ఆదేశాలపై క్యాష్‌ఫ్రీ నుంచి మాత్రం ఎటువంటి సమాధానం రాలేదు. అయితే ఆన్‌లైన్‌ చెల్లింపు ప్రాసెస్‌లో పాల్గొన్న కంపెనీలకు చెల్లింపు అగ్రిగేటర్‌ లైసెన్స్‌ను రిజర్వ్‌ బ్యాంకు జారీ చేస్తుంటుంది. ఈ క్రమంలో రేజర్‌పే, క్యాష్‌ ఫ్రి సంస్థలకు ఈ ఆదేశాలు జారీ చేసింది.

అయితే లావాదేవీలు, లైసెన్స్‌కు సంబంధించి గత సంవత్సరం జూలై నెలలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి రేజర్‌పేకు ఆమోదం లభించింది. ఈ క్రమంలో తుది లైసెన్స్‌ మంజూరుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని, కొంత అదనపు సమాచారం ఆర్బీఐకి అందించాల్సి ఉందని రేజర్‌పే చెబుతోంది. ఇందులో భాగంగానే అదనపు సమాచారం కోసం ఆన్‌లైన్‌ వ్యాపారులను తీసుకోవడం నిలిపివేయాలని ఆర్బీఐ కోరినట్లు రేజర్‌పే తెలిపింది. అయితే ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగానే తాము వ్యవహరిస్తున్నామని, రేజర్‌పే ప్రతినిధులు చెబుతున్నారు. రేజర్‌పే ఎక్స్‌, కార్పొరేట్‌ కార్డు, ఈజీట్యాప్‌ ద్వారా ఆఫ్‌లైన్‌ చెల్లింపుల సర్వీసులు యధావిధిగానే కొనసాగుతాయని, కొత్త వ్యాపారులకు అవకాశం ఉంటుందని పేర్కొంది. దీనిపై ఎలాంటి ఆందోళన చెందవద్దని తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి