Fake Currency: దేశంలో పెరుగుతున్న నకిలీ నోట్ల ప్రవాహం.. గత మూడేళ్లలో ఎంత పట్టుబడిందో తెలిస్తే షాకవుతారు!
దేశంలో నకిలీ నోట్ల ప్రవాహం ఇంకా కొనసాగుతోంది. నకిలీ కరెన్సీని అక్రమంగా రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడుతున్నారు. నకిలీ కరెన్సీ రవాణా పెరుగుతుండటంతో పోలీసులు ప్రత్యేక నిఘా..
దేశంలో నకిలీ నోట్ల ప్రవాహం ఇంకా కొనసాగుతోంది. నకిలీ కరెన్సీని అక్రమంగా రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడుతున్నారు. నకిలీ కరెన్సీ రవాణా పెరుగుతుండటంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. గత మూడేళ్లలో అంటే 2019 నుంచి 2021 వరకు నకిలీ కరెన్సీ137 కోట్ల విలువైన నోట్లను పోలీసులు, ఇతర భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అధిక విలువ కలిగిన నకిలీ కరెన్సీ ప్రతి సంవత్సరం పట్టుబడుతోంది. నకిలీ కరెన్సీ చెలామణి దేశంలో మరింతగా పెరుగుతోంది.
గత మూడేళ్లలో పట్టుబడిన రూ.137,96,17,270 నకిలీ కరెన్సీలో రూ.2000 కొత్త నోట్లు కూడా కోట్లకు చేరాయి. నకిలీ కరెన్సీ ఎక్కువగా వ్యాపారం జరుగుతోందని పోలీసులు చెబుతున్నారు. ఈ నకిలీ కరెన్సీ పాకిస్తాన్ నుండి అక్రమంగా రవాణా జరుగుతోందని, ఇతర మార్గాల్లో సరిహద్దు దాటి భారతదేశానికి వస్తోందని అనుమానిస్తున్నారు.
హోం మంత్రిత్వ శాఖడేటా ప్రకారం, 2019 నుండి 2021 వరకు రూ.137,96,17,270 విలువ కలిగిన నకిలీ నోట్లు పట్టుబడ్డాయి. 2021లో రూ.20 కోట్లకు పైగా విలువ చేసే 3,10,066 లక్షల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. 2020లో రూ.92 కోట్లకు పైగా జప్తు చేశారు. ఇక 2019లో పట్టుబడిన నకిలీ నోట్ల విలువ రూ.25 కోట్ల విలువతో 2,87,404 లక్షలు నోట్టు పట్టుబడ్డాయని తెలిపారు.
చలామణిలో రూ.500, రూ.2000 నకిలీ నోట్లు
గత మూడేళ్లలో పెద్ద మొత్తంలో రూ.2,000, రూ.500ల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు హోంశాఖ వెల్లడించింది. 2021లో రూ.4 కోట్లకు పైగా విలువైన రూ.2,000 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకోగా, నకిలీ రూ.500 ముఖ విలువ రూ.12,57,99,000 కోట్లు. ఇక 2020లో కోవిడ్ మహమ్మారి సంవత్సరంలో 2019లో 90,566,000 నకిలీ నోట్లు, 2,000 రూపాయల 2,44,834 లక్షల నోట్లు జప్తు చేసినట్లు తెలిపింది. కాగా, ఇలాంటి నకిలీ నోట్ల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు కేంద్రం వెల్లడించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి