Liquor Price: మందు బాబులకు కేంద్రం గుడ్‌న్యూస్‌ తెలుపనుందా..? పూర్తి వివరాలు ఇవే..!

దేశంలో ఎక్కువ అమ్మకాలు జరిగేవి ఏవి అంటే మద్యం అనే చెప్పాలి. రోజురోజుకు మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇక అధిక పన్ను రేటు ఆల్కహాలిక్‌ పానీయాల రంగాన్ని..

Liquor Price: మందు బాబులకు కేంద్రం గుడ్‌న్యూస్‌ తెలుపనుందా..? పూర్తి వివరాలు ఇవే..!
Liquor
Follow us

|

Updated on: Dec 19, 2022 | 11:57 AM

దేశంలో ఎక్కువ అమ్మకాలు జరిగేవి ఏవి అంటే మద్యం అనే చెప్పాలి. రోజురోజుకు మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇక అధిక పన్ను రేటు ఆల్కహాలిక్‌ పానీయాల రంగాన్ని దెబ్బ తీస్తున్నాయని, దేశంలోని మద్యం పరిశ్రమ భవిష్యత్తును మరింత కుంగదీసే అవకాశాలున్నాయని ఇంటర్నేషనల్‌ స్పిరిట్స్‌ అండ్‌ వైన్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఐఎస్‌డబ్ల్యూఏఐ) ఆందోళన వ్యక్తం చేస్తోంది. దేశం నుండి ఎగుమతులను ప్రోత్సహించడానికి రాబోయే యూనియన్ బడ్జెట్ 2023 లో ప్రీమియం బ్రాండ్‌ల ఆల్కహాల్ ఉత్పత్తులపై అధిక పన్ను విధించడంపై కీలక అశాలు లేవనెత్తింది. పన్ను రేటును తగ్గించాలని అభ్యర్థించింది. ఆల్కోబెవ్ పరిశ్రమలో ప్రీమియం బ్రాండ్లు 67 నుండి 80 శాతం పన్నును ఆకర్షిస్తాయని అసోసియేషన్ తెలిపింది. దీని కారణంగా సరఫరాదారులకు, వారితో వ్యాపారం చేసే వారికి ఖర్చులు మరింతగా పెరిగిపోతున్నాయి. ఇంత ఎక్కువ పన్ను రేటు కారణంగా ఈ బ్రాండ్లు తక్కువగా అమ్ముడవుతాయి. పన్ను తగ్గితే అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది. ఒక వైపు ద్రవ్యోల్బణం, అధిక పన్ను రేట్ల కారణంగా భారతీయ ఆల్కోబెవ్‌ పరిశ్రమ తవ్ర సంక్షోభంలో ఉంది.

ఈ నేపథ్యంలో ఈ రంగాన్ని నిలబెట్టుకునేందుకు పన్నులను తగ్గించడం, ఉత్పత్తుల ధరలను పెంచడం అవసరమని ఐఎస్‌డబ్ల్యూఏఐ సీఈవో నీతా కపూర్‌ అన్నారు. ఇతర పరిశ్రమల మాదిరిగా కాకుండా మద్యం పరిశ్రమకు ఉత్పత్తులకు ధర నిర్ణయించే స్వేచ్ఛ లేదని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం, అధిక పన్ను రేట్ల కారణంగా భారతీయ ఆల్కోవేవ్ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో పన్నులను తగ్గించడంపై చర్య తీసుకోకపోతే ఇబ్బందిగా మారే అవకాశం ఉందన్నారు.

ప్రతి రంగానికి తమ ఉత్పత్తుల ధరలను పెంచే స్వేచ్ఛ ఉందని, అయితే మద్యం ధరలను ప్రభుత్వాలు నిర్ణయిస్తాయని కపూర్ చెప్పారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు మద్యం పరిశ్రమల ద్వారా దాదాపు 25 నుంచి 40 శాతం ఆదాయం సమకూరుతోంది. ఇప్పుడు ధరలు పెంచితే పరిశ్రమ సంక్షోభం నుంచి బయటపడవచ్చు. వైన్, బీర్, విస్కీ తయారీకి ఉపయోగించే మొలాసిస్, గింజలు వంటి ముడి పదార్థాలు కూడా ఖరీదైనవిగా మారాయి.

ఇవి కూడా చదవండి

భారతదేశం ప్రపంచంలో తొమ్మిదో అతిపెద్ద మార్కెట్

భారతీయ ఆల్కోవేవ్ పరిశ్రమ 1.5 మిలియన్ల మంది ఉద్యోగులను కలిగి ఉంది. దీని మార్కెట్ పరిమాణం యూఎస్‌డీ 52.5 బిలియన్. భారత్‌ ప్రపంచంలో తొమ్మిదవ అతిపెద్ద మార్కెట్‌. ఐఎస్‌డబ్ల్యూఏఐ సెక్రటరీ జనరల్ సురేశ్ మీనన్ మాట్లాడుతూ.. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ తయారీదారుల స్థూల మార్జిన్, ముడి సరుకు ధర అధికం కావడం వల్ల ఏడాది క్రితం ఇదే కాలంతో పోలిస్తే తక్కువగా ఉందని చెప్పారు.

అదనపు ఆల్కహాల్ (ఈఎన్‌ఏ), బార్లీ వంటి తృణధాన్యాలు గత సంవత్సరం కంటే 12%, 46.2% ఖరీదైనవి అని ఐఎస్‌డబ్ల్యూఏఐ అంచనా వేసింది. అయితే గాజు, మోనో కార్టన్‌ల వంటి ప్యాకేజింగ్ పదార్థాల ధర వరుసగా 24.9%, 19% పెరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నును తగ్గిస్తే భారతదేశంలో కష్టాల్లో ఉన్న ఆల్కోవెవ్ తయారీదారులకు చాలా సహాయం లభిస్తుందన్నారు. పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకునేందుకు కరోనా మహమ్మారి ప్రారంభానికి ముందు ఏప్రిల్‌ 2020లో మద్యంపై 30 శాతం అదనపు పన్ను విధించింది. కానీ లేవీ కారణంగా అమ్మకాలు క్షీణించి సంవత్సరం చివరి భాగంలో ఎదురుదెబ్బ తగిలిందన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి