AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అసలైన సంక్షోభం ఇంకా రాలేదు! ఫ్యూయల్ ఆయిల్ లభించకుంటే.. అంతా అస్తవ్యస్తమే!

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల పెరుగుదలతో, పెట్రోల్/డీజిల్ కంటే ఫ్యూయల్ ఆయిల్ కొరత తీవ్రమవుతోంది. బ్యారెల్‌కు 100 డాలర్ల పైన ట్రేడవుతున్న క్రూడ్, ఆసియా పోర్టులలో ఫ్యూయల్ ఆయిల్ నిల్వలను తగ్గిస్తోంది. ప్రపంచ వ్యాపార నౌకలకు ఇది కీలక ఇంధనం కావడంతో, సింగపూర్ వంటి ప్రాంతాలలో ధరలు భారీగా పెరిగాయి.

అసలైన సంక్షోభం ఇంకా రాలేదు! ఫ్యూయల్ ఆయిల్ లభించకుంటే.. అంతా అస్తవ్యస్తమే!
Fuel Oil Shortage
SN Pasha
|

Updated on: Mar 16, 2026 | 6:30 AM

Share

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగినప్పుడల్లా సాధారణంగా ప్రజలు పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల గురించి మాత్రమే ఆందోళన చెందుతారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు బ్యారెల్‌కు సుమారు 100 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అయితే అసలు సమస్య ముడి చమురు ధరల కంటే శుద్ధి కర్మాగారాల్లో మిగిలే ఫ్యూయల్ ఆయిల్ కొరతగా మారుతోంది. ఈ చౌకైన ఇంధనం ప్రపంచ వ్యాపార నౌకలకు ప్రధాన శక్తి కావడంతో, దీని కొరత ప్రపంచ వాణిజ్యాన్ని ప్రభావితం చేసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ముడి చమురు నుంచి పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం వంటి ఉత్పత్తులను తీసిన తర్వాత మిగిలేది ఫ్యూయల్ ఆయిల్. సాధారణంగా దీనిని బారెల్ బాటమ్ గా పరిగణించినప్పటికీ, భారీ కంటైనర్ షిప్స్ నడవడానికి ఇదే ప్రధాన ఇంధనం. అందుకే ఇది ప్రపంచీకరణకు కీలకమైన ఇంధనంగా భావిస్తారు. ప్రపంచంలో అతిపెద్ద షిప్పింగ్ కంపెనీలలో ఒకటైన ఏపీ మోలర్–మేయర్స్‌క్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విన్సెంట్ క్లర్క్ పరిస్థితి మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తక్షణ చర్యలు తీసుకోకపోతే ఆసియాలోని ప్రధాన పోర్ట్స్ లో ఇంధన నిల్వలు తగ్గిపోతాయని ఆయన తెలిపారు.

ప్రస్తుతం ప్రపంచంలోని ప్రధాన బంకరింగ్ హబ్ లలో ఒకటైన సింగపూర్, యూఏఈలోని ఫుజైరా ప్రాంతాలు ఇప్పటికే ఫ్యూయల్ ఆయిల్ షార్టేజ్ ను ఎదుర్కొంటున్నాయి. సింగపూర్‌లో ఈ ఇంధన ధర బ్యారెల్‌కు సుమారు 140 డాలర్లకు చేరుకోగా, ఫుజైరాలో 160 డాలర్ల వరకు పెరిగింది. కొన్ని ఎన్విరాన్‌మెంట్ ఫ్రెండ్లీ రకాల ధరలు 175 డాలర్ల వరకు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితికి ప్రధాన కారణం స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ సముద్ర మార్గం మూసివేయబడటం. గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, కువైట్, యూఏఈలోని శుద్ధి కర్మాగారాల నుంచి ప్రపంచానికి వెళ్లే ఇంధన చమురు సరఫరాలో ఈ మార్గం కీలక పాత్ర పోషిస్తుంది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వర్తకం చేసే ఫ్యూయల్ ఆయిల్‌లో సుమారు 20 శాతం ఈ ప్రాంతం నుంచే వస్తుంది.

ప్రస్తుతం అమెరికా, యూరప్ ప్రాంతాల నుంచి ఆసియాకు ఫ్యూయల్ ఆయిల్‌ను షిప్పింగ్ ద్వారా తరలించడం ద్వారా కొంతవరకు పరిస్థితిని నిర్వహిస్తున్నారు. అయితే ఈ సంక్షోభం ఎక్కువకాలం కొనసాగితే కంటైనర్ షిప్స్ కు ఇంధన సరఫరా తగ్గి ప్రపంచ సప్లై చెయిన్ పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని ప్రభావంగా ప్రపంచవ్యాప్తంగా ఇన్‌ఫ్లేషన్ మరింత పెరిగే ప్రమాదం కూడా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
'చావు అంచున ఉన్నాను.. కాపాడండి'.. టాలీవుడ్ నటి షాకింగ్ వీడియో
'చావు అంచున ఉన్నాను.. కాపాడండి'.. టాలీవుడ్ నటి షాకింగ్ వీడియో
అందమైన అమ్మాయి పాదాలతో చేసిన రొట్టె..అదంటే మగాళ్లకు పిచ్చి..!
అందమైన అమ్మాయి పాదాలతో చేసిన రొట్టె..అదంటే మగాళ్లకు పిచ్చి..!
జస్ట్ 2 గంటల్లో దుబాయ్‌కి.. విమానం కంటే వేగం.. ఈ సూపర్ ట్రైన్..
జస్ట్ 2 గంటల్లో దుబాయ్‌కి.. విమానం కంటే వేగం.. ఈ సూపర్ ట్రైన్..
టెస్టు ఫార్మాట్‌లోకి రీఎంట్రీ.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన కోహ్లీ..!
టెస్టు ఫార్మాట్‌లోకి రీఎంట్రీ.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన కోహ్లీ..!
ఆరుద్ర కార్తె అంటే ఏమిటి? ఇది రైతులకు ఎందుకు స్పెషల్!
ఆరుద్ర కార్తె అంటే ఏమిటి? ఇది రైతులకు ఎందుకు స్పెషల్!
పద్మశ్రీ ఇచ్చారు.. కానీ పట్టా ఇవ్వరా..? కిన్నెర మొగిలయ్య ఆవేదన
పద్మశ్రీ ఇచ్చారు.. కానీ పట్టా ఇవ్వరా..? కిన్నెర మొగిలయ్య ఆవేదన
నిర్జల ఏకాదశి.. తులసితో ఈ చిన్న పరిహారాలు చేస్తే ధనలక్ష్మి..
నిర్జల ఏకాదశి.. తులసితో ఈ చిన్న పరిహారాలు చేస్తే ధనలక్ష్మి..
1998లో వచ్చిన సినిమా.. నా కెరీర్‏లోనే పీక్ షాట్ అది.. జగపతి బాబు.
1998లో వచ్చిన సినిమా.. నా కెరీర్‏లోనే పీక్ షాట్ అది.. జగపతి బాబు.
100 ఏళ్ల చరిత్ర కలిగిన అమ్మమ్మల కాలం నాటి సంప్రదాయ దప్పలం!
100 ఏళ్ల చరిత్ర కలిగిన అమ్మమ్మల కాలం నాటి సంప్రదాయ దప్పలం!
పిల్లలు పక్క తడపడం ఏ వయసు వరకు నార్మల్? వైద్యులు చెప్పిన నిజాలు!
పిల్లలు పక్క తడపడం ఏ వయసు వరకు నార్మల్? వైద్యులు చెప్పిన నిజాలు!