AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Card: మీ ఇంటిలో అద్దెకు ఉండేవారు అనుమానస్పదంగా ఉన్నారా..? వారి ఆధార్‌ నిజమైనదా? కదా? తెలుసుకోండిలా!

ప్రస్తుతం అవసరమయ్యే డాక్యుమెంట్లలో అన్నింటికి ఆధార్‌ కార్డే ముఖ్యమైపోయింది. బ్యాంకు అకౌంట్‌ నుంచి సిమ్‌ కార్డు తీసుకునే వరకు ముఖ్యమైన పత్రంగా మారిపోయింది. ఇది లేనిది..

Aadhaar Card: మీ ఇంటిలో అద్దెకు ఉండేవారు అనుమానస్పదంగా ఉన్నారా..? వారి ఆధార్‌ నిజమైనదా? కదా? తెలుసుకోండిలా!
Aadhaar Card
Subhash Goud
|

Updated on: Dec 18, 2022 | 9:53 PM

Share

ప్రస్తుతం అవసరమయ్యే డాక్యుమెంట్లలో అన్నింటికి ఆధార్‌ కార్డే ముఖ్యమైపోయింది. బ్యాంకు అకౌంట్‌ నుంచి సిమ్‌ కార్డు తీసుకునే వరకు ముఖ్యమైన పత్రంగా మారిపోయింది. ఇది లేనిది ఏ పని జరగదు. అయితే పలు ప్రాంతాల్లో కొందరు అనుమానస్పద వ్యక్తులు అద్దెకు దిగుతున్నారు. వారు ఏం పనులు చేస్తారో.. ఎవ్వరికి తెలియదు. మోసగాళ్లు, దొంగలు ఇలా రకరకాల వ్యక్తులు అద్దె ఇళ్లలో ఉంటూ వివిధ రకాల మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వ్యక్తులను వారు ఎలాంటి వారే గుర్తించడం మంచిదని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది.

అయితే అలాంటి అనుమానస్పద వ్యక్తులు నకిలీ ఆధార్‌ కార్డులు సృష్టించి అద్దె ఇళ్లల్లో ఉంటూ వివిధ రకాల మోసాలకు పాల్పడుతున్నారు. అద్దెకు ఉంటున్నవారి ఆధార్‌ కార్డును పరిశీలించి వారి ఆధార్‌ నకిలీదా..? నిజమైనదా..? అని గుర్తించడం ఎంతో ముఖ్యం. ఇళ్లల్లో అద్దెకు ఉంటున్న వ్యక్తుల ఆధార్‌ కార్డు నకిలీదా..? లేదా అనే విషయాన్ని ధృవీకరించుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. తాజాగా ఆధార్‌కు సంబంధించిన అనేక కేసులు తెరపైకి వస్తున్నాయి. మీ పేరుపై కూడా ఇతరులు నకిలీ ఆధార్‌ కార్డు సృష్టించే ప్రమాదం ఉందని, చాలా జాగ్రత్తగా ఉండాలని యూఐడీఏఐ వినియోగదారులను హెచ్చరిస్తుంది. మీ ఆధార్ కార్డు నకిలీదా లేదా నిజమైనదా ఒక్కసారి చెక్ చేసుకోండని సూచిస్తుంది.

UADAI తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఆధార్ మోసం గురించి ప్రజలను హెచ్చరిస్తోంది. ఆధార్ పేరిట మోసాలకు పాల్పడుతున్న కేటుగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఏజెన్సీ తెలిపింది. మీ ఆధార్ నిజమైనదా, నకిలీదా అని మీరు ఎలా తనిఖీ చేయవచ్చో ట్విట్టర్ ద్వారా తెలిపింది. పూర్తిగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఆధార్ కార్డును ధృవీకరించడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఈ రెండు మార్గాల్లో మీరు ఆధార్‌కు సంబంధించిన ఏ సమస్యకైనా పరిష్కారం పొందవచ్చు. ఆధార్ ఆఫ్‌లైన్‌లో తనిఖీ చేయడానికి దాని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలని యుఐడిఎఐ తెలిపింది. ఆన్‌లైన్‌లో తనిఖీ చేయడానికి, రెసిడెంట్.యూడై.గోవ్.ఇన్ / వెరిఫై లింక్‌ను సందర్శించడం ద్వారా 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. అప్పుడే తెలిసిపోతుంది వారి ఆధార్‌ కార్డు నకిలీదా..? లేదా అనేది. మీకు కావాలంటే ఈ పనిని m-Aadhaar యాప్ ద్వారా కూడా చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఇలాంటి సిలిండర్‌ను అస్సలు తీసుకోకండి.. ఇది చాలా మందికి తెలియదు
ఇలాంటి సిలిండర్‌ను అస్సలు తీసుకోకండి.. ఇది చాలా మందికి తెలియదు
గురు గ్రహం అనుకూలత.. త్వరలో ఈ రాశుల వారికి వివాహ యోగం..!
గురు గ్రహం అనుకూలత.. త్వరలో ఈ రాశుల వారికి వివాహ యోగం..!
అయోధ్య విరాళాల కేసుపై చంపత్ రాయ్ స్పష్టత..!
అయోధ్య విరాళాల కేసుపై చంపత్ రాయ్ స్పష్టత..!
నా వల్ల కాదు బాబోయ్.. బిగ్ బాస్‏కు వెళ్లే ఓపిక నాకు లేదు..
నా వల్ల కాదు బాబోయ్.. బిగ్ బాస్‏కు వెళ్లే ఓపిక నాకు లేదు..
గుడ్ల కంటే ఎక్కువ ప్రొటీన్ కావాలా?శాకాహారులకు వరంఈ 5 సూపర్ ఫుడ్స్
గుడ్ల కంటే ఎక్కువ ప్రొటీన్ కావాలా?శాకాహారులకు వరంఈ 5 సూపర్ ఫుడ్స్
వరల్డ్ కప్ గెలిస్తే విన్నర్ కు ఎన్ని కోట్లు వస్తుందో తెలుసా ?
వరల్డ్ కప్ గెలిస్తే విన్నర్ కు ఎన్ని కోట్లు వస్తుందో తెలుసా ?
మరోసారి రెచ్చిపోయిన ర్యాప్ గ్యాంగ్.. తక్కువ ధరకే బంగారం అంటూ..
మరోసారి రెచ్చిపోయిన ర్యాప్ గ్యాంగ్.. తక్కువ ధరకే బంగారం అంటూ..
జూలై 2026 మాసఫలాలు: ఆర్థిక విషయాల్లో వారికి శుభవార్తలు..
జూలై 2026 మాసఫలాలు: ఆర్థిక విషయాల్లో వారికి శుభవార్తలు..
వివాదంలో ఐపీఎల్ క్రికెటర్.. పోలీస్ కేసు నమోదు!
వివాదంలో ఐపీఎల్ క్రికెటర్.. పోలీస్ కేసు నమోదు!
మీరు బంగారంపై రుణం తీసుకుంటున్నారా? మీకో భారీ గుడ్‌న్యూస్‌..!
మీరు బంగారంపై రుణం తీసుకుంటున్నారా? మీకో భారీ గుడ్‌న్యూస్‌..!