Fixed Deposit: ఈ ప్రైవేట్ బ్యాంక్ తన కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఈ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు

ప్రైవేట్ రంగ బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. రెండు కోట్ల రూపాయల కంటే తక్కువ ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఈ వడ్డీ రేట్ల పెంపును ప్రకటించింది. బ్యాంక్..

Fixed Deposit: ఈ ప్రైవేట్ బ్యాంక్ తన కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఈ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు
Fixed Deposit
Follow us
Subhash Goud

|

Updated on: Dec 18, 2022 | 8:17 PM

ప్రైవేట్ రంగ బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. రెండు కోట్ల రూపాయల కంటే తక్కువ ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఈ వడ్డీ రేట్ల పెంపును ప్రకటించింది. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. కొత్త రేట్లు డిసెంబర్‌ 18 నుంంచి అమలులోకి వచ్చాయి. ఈ మార్పు తర్వాత బ్యాంక్ ఇప్పుడు సాధారణ ప్రజలకు 3.00% నుండి 6.30%, సీనియర్ సిటిజన్‌లకు 3.50% నుండి 6.95% వరకు FDలపై వడ్డీని చెల్లిస్తోంది. ఇది 7 రోజుల నుండి 2223 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాల వ్యవధి కలిగిన ఎఫ్‌డీలపై వర్తిస్తుంది.

ఇవీ కొత్త వడ్డీ రేట్లు

బ్యాంక్ ఇప్పుడు 7 రోజుల నుండి 29 రోజులలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై 3.00 శాతం వడ్డీని చెల్లిస్తోంది. అదే సమయంలో 30 నుండి 4 రోజుల వ్యవధి కలిగిన ఎఫ్‌డీలపై 3.25 శాతం వడ్డీ రేటు ఉంటుంది. అదే సమయంలో 46 రోజుల నుండి 60 రోజుల కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.00 శాతం వడ్డీ రేటు ఉంటుంది. అయితే, 61 రోజుల నుండి 90 రోజుల వరకు ఉండే ఎఫ్‌డీలపై 4.25 శాతం చొప్పున వడ్డీ లభిస్తుంది.

ఫెడరల్ బ్యాంక్ ఇప్పుడు 91 రోజుల నుండి 119 రోజుల మధ్య కాలపరిమితి కలిగిన ఎఫ్‌డీలపై 4.50 శాతం వడ్డీ రేటును కలిగి ఉంది. కాగా, 120 రోజుల నుంచి 180 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.75 శాతం వడ్డీ లభిస్తుంది. అదే సమయంలో బ్యాంక్ 181 రోజుల నుండి 270 రోజుల వ్యవధితో ఎఫ్‌డీలపై 5.75 శాతం వడ్డీ రేటును కలిగి ఉంటుంది. మరోవైపు, 271 రోజుల నుండి ఒక సంవత్సరం లోపు మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై బ్యాంక్ 6.00 శాతం వడ్డీని చెల్లిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరోవైపు, బ్యాంక్ ఒక సంవత్సరం నుండి 18 నెలల కంటే తక్కువ ఎఫ్‌డీలపై 6.60 శాతం వడ్డీని చెల్లిస్తోంది. 18 నెలల నుంచి 2 సంవత్సరాల కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.25 శాతం వడ్డీ రేటు ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
బరువు పెరగమన్న అభిమాని.. ఇచ్చిపడేసిన సమంత.!
బరువు పెరగమన్న అభిమాని.. ఇచ్చిపడేసిన సమంత.!
2 వేల నోట్లు మళ్లీ మార్చుకునే ఛాన్సుంటుందా.? ఆర్బీఐ ప్రకటన..
2 వేల నోట్లు మళ్లీ మార్చుకునే ఛాన్సుంటుందా.? ఆర్బీఐ ప్రకటన..
గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధర.. ఎంతో తెలుసా.?
గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధర.. ఎంతో తెలుసా.?
అన్ స్టాపబుల్ షోలో ఎమోషనల్‌. కన్నీళ్లు పెట్టుకున్న సూర్య,బాలకృష్ణ
అన్ స్టాపబుల్ షోలో ఎమోషనల్‌. కన్నీళ్లు పెట్టుకున్న సూర్య,బాలకృష్ణ
అమెరికా ఎన్నికల్లో బాలయ్యకు ఓటు వేసిన యువకుడిపై ట్రోలింగ్.!
అమెరికా ఎన్నికల్లో బాలయ్యకు ఓటు వేసిన యువకుడిపై ట్రోలింగ్.!