Pension Scheme: ప్రతినెల రూ.3000 పెన్షన్ కావాలా..? ఈ స్కీమ్‌లో దరఖాస్తు చేసుకోండి.. ఎవరెవరు అర్హులంటే..
పేదల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ఈ పథకాలలో ప్రభుత్వం ప్రజలకు ఉచిత రేషన్‌ను కూడా అందిస్తుంది. అదే సమయంలో రైతుల కోసం..
పేదల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ఈ పథకాలలో ప్రభుత్వం ప్రజలకు ఉచిత రేషన్‌ను కూడా అందిస్తుంది. అదే సమయంలో రైతుల కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. రైతుల కోసం అమలు చేస్తున్న పథకంలో ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయం కూడా అందిస్తుంది. అదే సమయంలో కూలీల కోసం ప్రభుత్వం ఒక పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకంలో ప్రభుత్వం ద్వారా ప్రజలకు పెద్దఎత్తున ఆర్థిక సహాయం అందజేస్తోంది.
కేంద్ర బడ్జెట్ 2023ని ప్రభుత్వం త్వరలో సమర్పించబోతోంది. అయితే బడ్జెట్‌కు ముందు కార్మిక మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌లో ప్రభుత్వం అమలు చేస్తున్న పెన్షన్ స్కీమ్ గురించి సమాచారం అందించింది. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల కోసం ఈ పింఛను పథకం అమలు చేయడం విశేషం. అసంఘటిత రంగమంటే.. భవన నిర్మాణ కూలీలు, హమాలీలు, వీధి వ్యాపారులు, ఇటుక బట్టీల్లో పనిచేసే కూలీలు, చెత్త ఏరుకునేవారు, ఇళ్లల్లో పనిచేసేవారు, బట్టలు ఉతికేవారు, రిక్షా తొక్కేవారు, భూమి లేని నిరుపేద కూలీలు, వ్యవసాయ కూలీలు, బీడి కార్మికులు, చేనేత కార్మికులు, లెదర్ వర్కర్స్, తదితరులు అసంఘటిత రంగంలోకి వస్తారు.
ప్రధాన్ మంత్రి శ్రమ యోగి మంధన్ పెన్షన్ యోజన:
ప్రధానమంత్రి శ్రమ యోగి మంధన్ పెన్షన్ యోజన ప్రభుత్వంచే అమలు చేయబడుతోంది. ఇందులో ప్రతినెలా 3 వేల రూపాయల పింఛను ఇస్తారు. కార్మిక మంత్రిత్వ శాఖ తరపున ట్వీట్ చేస్తూ ‘ప్రధాన్ మంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ పెన్షన్ పథకం ద్వారా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం ద్వారా ప్రతి నెల రూ.3000 వరకు పింఛను అందించనున్నట్లు తెలిపింది.
ఈ ప్రధాన్ మంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ పెన్షన్ యోజన అనేది స్వచ్ఛంద, కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం. దీని కింద కస్టమర్ కూడా అనేక ప్రయోజనాలను పొందుతారు. ఇందులో కార్మికవర్గం 60 ఏళ్లు దాటిన తర్వాత కచ్చితంగా నెలకు రూ.3000 పొందుతారు. మరోవైపు, పింఛను పొందే సమయంలో వ్యక్తి మరణిస్తే, లబ్ధిదారుని భార్య లేదా భర్త అందుకున్న పింఛనులో 50 శాతానికి అర్హులు. దీనితో పాటు భారత ప్రభుత్వం ద్వారా సమాన సహకారం ఉంటుంది. 18-40 ఏళ్ల కార్మికులు ప్రతీ నెలా రూ.55 నుంచి రూ.200 వరకు చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్లు నిండిన తర్వాత వారికి ప్రతీ నెలా రూ.3 వేలు ఫించన్ రూపంలో అందుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి