LIC Policy: మెచ్యూరిటీకి ముందు ఎల్‌ఐసీ పాలసీని సరెండర్ చేయాలనుకుంటున్నారా? నియమాలేంటి?
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అన్ని వయసుల వారి కోసం పాలసీని ప్రవేశపెట్టింది. ఈ పాలసీ ప్లాన్‌ల కింద ప్రజలకు విభిన్న ప్రయోజనాలు అందిస్తోంది. మీరు కూడా ఎల్ఐసీ..
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అన్ని వయసుల వారి కోసం పాలసీని ప్రవేశపెట్టింది. ఈ పాలసీ ప్లాన్‌ల కింద ప్రజలకు విభిన్న ప్రయోజనాలు అందిస్తోంది. మీరు కూడా ఎల్‌ఐసీ పాలసీని కొనుగోలు చేసి, దానిని సరెండర్ చేయాలనుకుంటే దానికి సంబంధించిన నియమం గురించి తెలుసుకోవడం అవసరం. వివిధ కారణాల వల్ల ఎల్‌ఐసీ పాలసీ సరెండర్ చేయడం జరుగుతుంది. చాలా సార్లు పాలసీ హోల్డర్లు తెలియకుండానే పాలసీని కొనుగోలు చేసి, ఆ తర్వాత ఈ పాలసీ వల్ల ఉపయోగం లేదని భావిస్తారు. అటువంటి పరిస్థితిలో వారు ఎల్‌ఐసీ పాలసీని సరెండర్ చేయడం గురించి ఆలోచిస్తారు. ఇది కాకుండా, తక్కువ రాబడి, అత్యవసర సమయంలో కూడా పాలసీని సరెండర్ చేయవచ్చు.
పాలసీని సరెండర్ చేయడంపై ఎలాంటి నియమాలున్నాయి?
మీరు కూడా మీ పాలసీని మెచ్యూరిటీకి ముందే సరెండర్ చేయాలనుకుంటే దానికి సంబంధించిన నియమాల గురించిన తెలుసుకోండి. మెచ్యూరిటీకి ముందే ఎల్ఐసీ పాలసీని సరెండర్ చేయడం వల్ల దాని విలువ తగ్గుతుంది. మరోవైపు, మీరు రెగ్యులర్ పాలసీని తీసుకొని దానిని సరెండర్ చేయాలనుకుంటే మీ విలువ 3 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించిన తర్వాత మాత్రమే లెక్కించబడుతుంది. కానీ మీరు మూడేళ్లలోపు పాలసీని సరెండర్ చేస్తే అప్పుడు కంపెనీ ఎటువంటి విలువ ఇవ్వదు.
పాలసీని ఈ రెండు మార్గాల్లో సరెండర్ చేయవచ్చు:
పాలసీదారులు మూడేళ్ల తర్వాత మాత్రమే పాలసీని సరెండర్ చేయాలి. పాలసీదారులు మూడేళ్లపాటు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని గుర్తించుకోవాలి. మీరు మూడు సంవత్సరాల తర్వాత సరెండర్ చేస్తే ప్రమాదవశాత్తు ప్రయోజనం కోసం చెల్లించిన ప్రీమియంలను మినహాయించి, చెల్లించిన ప్రీమియంలలో సరెండర్ విలువ దాదాపు 30% ఉంటుంది. ఈ కారణంగా మూడేళ్ల తర్వాత సరెండర్ చేసుకోవడం మంచిది. దీని కింద, పాలసీని ఎప్పుడైనా సరెండర్ చేయవచ్చు. ప్రత్యేక సరెండర్ విలువలో, బేసిక్ సమ్ అష్యూర్డ్, చెల్లించిన ప్రీమియంల సంఖ్య, మొత్తం ప్రీమియంల సంఖ్య మరియు అందుకున్న మొత్తం బోనస్ మొదలైన వాటి ఆధారంగా మొత్తం చెల్లించబడుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి