AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GST Council: జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం వల్ల ఎస్‌యూవీ ధరలు పెరగనున్నాయా..?

రానున్న రోజుల్లో దేశంలో ఎస్‌యూవీ కార్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. శనివారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఎస్‌యూవీలపై స్పష్టత వచ్చింది. పరిహారం సెస్ 22 శాతం ఎక్కువ..

GST Council: జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం వల్ల ఎస్‌యూవీ ధరలు పెరగనున్నాయా..?
SUV
Subhash Goud
|

Updated on: Dec 18, 2022 | 3:07 PM

Share

రానున్న రోజుల్లో దేశంలో ఎస్‌యూవీ కార్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. శనివారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఎస్‌యూవీలపై స్పష్టత వచ్చింది. పరిహారం సెస్ 22 శాతం ఎక్కువ రేటుతో విధించనున్నట్లు కౌన్సిల్‌ తెలిపింది. 48వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. నాలుగు షరతులకు అనుగుణంగా ఉండే మోటారు వాహనాలపై 22 శాతం అధిక రేటుతో పరిహారం సెస్ విధించనున్నట్లు తెలిపారు. ఈ వాహనాల ఇంజన్ సామర్థ్యం 1,500సీసీ కంటే ఎక్కువగా ఉండాలని ఆమె తెలిపారు. ఇది కాకుండా పొడవు 4,000 మిమీ కంటే ఎక్కువ, గ్రౌండ్ క్లియరెన్స్ 170 మిమీ ఎక్కువగా ఉండాలని తెలిపారు.

ఆటోమొబైల్ పరిశ్రమకు చెందిన సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్, జీఎస్టీ కౌన్సిల్ ద్వారా ఎస్‌యూవీ నిర్ణయాన్ని స్వాగతించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖతో తాను జరిపిన చర్చల ప్రకారమే ఈ విషయాన్ని తెలియజేశారని తెలిపారు. ఈ నాలుగు షరతులను నెరవేర్చే వాహనాలపై 28 శాతం జీఎస్టీపై 22 శాతం పరిహారం సెస్ కూడా వర్తిస్తుందని ఈ నిర్ణయం స్పష్టం చేసిందని సియామ్ ఒక ప్రకటన విడుదల చేసింది.

కాగా, ఈ సమావేశంలో మొత్తం 15 అంశాలపై చర్చ జరగాల్సి ఉండగా, కేవలం 8 అంశాలపైనే చర్చ జరిపింది. అయితే ఆన్‌లైన్‌ క్రీడలపై 28 శాతం జీఎస్టీ విధించాలని మంత్రుల బృందం తన నివేదికలో సిఫార్సు చేసింది. అయితే ఈ సమావేశంలో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటారని అందరు భావించినా.. చివరికు ఎలాంటి చర్చ జరపకుండా వాయిదా వేసింది కౌన్సిల్‌. ఇథనాల్‌పై 18 నుంచి 5 శాతానికి జీఎస్టీని తగ్గించారు. ఇక జీఎస్టీని ఎగ్గొట్టే సంస్థలకు భారీగా జరిమానా విధించాలని కౌన్సిల్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే పప్పుల పొట్టుపై ఉన్న 5శాతం జీఎస్టీని పూర్తిగా ఎత్తివేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి