Elon Musk Poll: షాకింగ్! ట్విటర్‌ నుంచి వైదొలగనున్న ఎలన్‌ మస్క్‌.. ‘నేను హెడ్‌గా ఉండాలా? వద్దా? ‘అంటూ యూజర్లకు సూటి ప్రశ్న..

ప్రపంచ కుబేరుబు, ట్విటర్ హెడ్ అయిన ఎలాన్‌ మస్క్‌ నెటిజన్ల అభిప్రాయ సేకరణకు మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లో సోమవారం (డిసెంబర్‌ 19) ఓ సర్వే ప్రారంభించాడు. ఈ సర్వే రిజల్ట్స్‌ రేపు ఉదయం ప్రకటిస్తానని కూడా చెప్పాడు. తనకు ఒక విషయంపై క్లారిటీ కావాలట..

Elon Musk Poll: షాకింగ్! ట్విటర్‌ నుంచి వైదొలగనున్న ఎలన్‌ మస్క్‌.. 'నేను హెడ్‌గా ఉండాలా? వద్దా? 'అంటూ యూజర్లకు సూటి ప్రశ్న..
Elon Musk Poll
Follow us

|

Updated on: Dec 20, 2022 | 10:50 AM

ప్రపంచ కుబేరుడు, ట్విటర్ హెడ్ అయిన ఎలాన్‌ మస్క్‌ నెటిజన్ల అభిప్రాయ సేకరణకు మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లో సోమవారం (డిసెంబర్‌ 19) ఓ సర్వే ప్రారంభించాడు. ఈ సర్వే రిజల్ట్స్‌ రేపు ఉదయం ప్రకటిస్తానని కూడా చెప్పాడు. తనకు ఒక విషయంపై క్లారిటీ కావాలట. అందుకే ఈ సర్వే.. దీనిలో వచ్చిన ఫలితాలను బట్టి తన నిర్ణయం ఆధారపడి ఉంటుందని తెగేసి చెప్పాడు. ఇంతకీ విషయం ఏమంటే.. ఎలన్‌ మస్క్‌ ట్విటర్ హెడ్‌గా ఉండాలా? వద్దా? అనే దానిపై ప్రజాభిప్రాయ సేకరనకే ఈ సర్వే. ఇప్పటి వరకు 57.2 శాతం మంది ప్రజలు మస్క్ ట్విట్టర్ హెడ్‌గా ఉండటం ఇష్టం లేదని తమ ఓటింగ్‌ ద్వారా తెలిపారు. తుది ఫలితం రావడానికి ఇంకా 9 గంటల సమయం ఉంది.

ఈ క్రమంలో మస్క్‌ మరో ట్వీట్‌ చేశాడు. దానిలో ఏం చెప్పాడంటే.. ‘మీకేం కావాలో జాగ్రత్తగా ఎంచుకోండి.. అది మీకు లభించే అవకాశం ఉంది’ అని సూచన కూడా చేశాడు. ఇక మస్క్‌ పోల్‌పై ట్విటర్‌ యూజర్లు మిశ్రమ స్పందన తెలియజేస్తున్నారు. ఒకవేళ ఎక్కువమంది మస్క్‌ సీఈవో పదవి నుంచి వైదొలగాలని భావిస్తే.. అతను మరో కొత్త వ్యక్తిని ఆ స్థానంలో ఉంచడానికి దొరికే వరకు సీఈవోగానే ఉంటాడు. మస్క్‌ సీఈవోగా కొనసాగడం ఇష్టమేనని భావించినా.. అదే జరుగుతుంది. ఓటింగ్‌ ప్రక్రియ అనవసరం అని పలువురు కామెంట్ సెక్షన్‌లో తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా మస్క్ దాదాపు 44 బిలియన్ డాలర్ల డీల్‌తో ట్విట్టర్‌ని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఐతే కేవలం మూడు నెలల వ్యవధిలోనే ట్విట్టర్ మాజీ సీఈవో పరాగ్ అగర్వాలోపాటు, దాదాపు 50శాతం మంది ఉద్యోగులను తొలగించాడు. మస్క్‌ సీఈవోగా టేకోవర్ చేసినప్పటి నుంచి ట్విటర్‌ భారీ ఒడిదుడుకులకు గురైంది. బ్లూ టిక్ కోసం ఛార్జీలు, జర్నలిస్టుల ఖాతాలను నిషేధించడంతో పాటుగా మస్క్ తీసుకున్న అనేక నిర్ణయాలు బోల్తాకొట్టాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.