FIFA World Cup highlights 2022: అర్జెంటీనా ఖాతాలో ఫిఫా మూడో కప్! తర్వాత జరగబోయే ఫిఫా వరల్డ్ కప్-2026 టోర్నీకి ఆతిథ్య దేశం ఏదంటే..
Srilakshmi C |
Updated on: Dec 19, 2022 | 9:26 AM
ఖతర్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్ 2022 ఫైనల్లో సమవుజ్జీల పోరు అత్యంత ఉత్కంఠ భరితంగా సాగింది. సమవుజ్జీలు ఫ్రాన్స్-అర్జెంటీనా హోరాహోరీగా పోరాడాయి. ఫైనల్ షూటౌట్లో 4-2తో అర్జెంటీనా ప్రపంచ కప్‌ను ఎగురేసుకుపోయింది. ఆ తర్వాత..
Dec 19, 2022 | 9:26 AM
ఖతర్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్ 2022 ఫైనల్లో సమవుజ్జీల పోరు అత్యంత ఉత్కంఠ భరితంగా సాగింది. సమవుజ్జీలు ఫ్రాన్స్-అర్జెంటీనా హోరాహోరీగా పోరాడాయి. ఫైనల్ షూటౌట్లో 4-2తో అర్జెంటీనా ప్రపంచ కప్‌ను ఎగురేసుకుపోయింది.
1 / 5
ఖతార్‌లో ఫుట్‌బాల్ ప్రపంచకప్ సంబరం ముగిసింది. 36 ఏళ్ల తర్వాత అర్జెంటీనా ఫిఫా వరల్డ్ కప్‌ను మూడోసారి కైవసం చేసుకుంది.
2 / 5
ప్రతిష్టాత్మక ఫీఫా వరల్డ్ కప్‌లో ఉత్తమ యంగ్ ప్లేయర్‌గా ఎంజో ఫెర్నాండెజ్ (అర్జెంటీనా) నిలిచాడు. ఉత్తమ గోల్‌కీపర్ (గోల్డ్ గ్లోవ్స్) మార్టినెజ్ (అర్జెంటీనా) నిలిచాడు. అత్యధిక గోల్స్ (గోల్డెన్ షూ) చేసిన ఆటగాడిగా ఎంబాపె (ఫ్రాన్స్) నిలిచాడు. ఫిఫా వరల్డ్‌కప్ 2022కు ఉత్తమ ఆటగాడిగా (గోల్డెన్ బాల్) మెస్సి నిలిచాడు.
3 / 5
ఫ్రాన్స్ Vs అర్జెంటీనా ఫైనల్ మ్యాచ్‌కు తలపడకముందు ప్రపంచకప్ ట్రోఫీని బాలీవుడ్ నటి దీపిక పదుకొనె ఆవిష్కరించింది.
4 / 5
మెక్సికో, కెనడాలతో కలిసి 2026 టోర్నీకి అమెరికా ఆతిథ్యమివ్వబోతోంది. 2026 జూన్-జులై నెలల్లో అమెరికా, మెక్సికో, కెనడాల్లోని 16 నగరాల్లో సాకర్ ప్రపంచకప్ జరగనుందన్నమాట.