Year Ender 2022: క్రికెట్‌లో టెస్టుకు అత్యున్నత హోదా ఎప్పటికీ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఫార్మాట్‌లో బ్యాట్స్‌మెన్స్, బౌలర్ల ఆధిపత్యాన్ని చూడొచ్చు. ఒక్కోసారి బౌలర్లు మ్యాచ్ మొత్తాన్ని మలుపు తిప్పేస్తుంటారు. ఈ ఏడాది ఇప్పటి వరకు చాలా మంది బౌలర్లు టెస్టులో తమ సత్తా చాటారు. ఇందులో ఆఫ్రికన్ ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ నంబర్ వన్‌గా నిలిచాడు. ఈ ఏడాది ఇప్పటివరకు టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టాడు. 2022లో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 10 బౌలర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..