- Telugu News Photo Gallery Cricket photos AUS vs SA: 10 batsman duck in a AUS vs SA test match at Brisbane
AUS vs SA: బెంబేలెత్తిన బ్యాటర్లు.. ఒకే మ్యాచ్ లో ఏకంగా పది మంది డకౌట్.. రెండు రోజుల్లోనే 34 వికెట్లు డౌన్
క్రికెట్ మ్యాచ్‌లో బ్యాటర్లు సున్నా వద్ద అవుట్ కావడం పెద్ద విశేషమేమీ కాదు. కానీ, ఒకే మ్యాచ్‌లో 10 మంది బ్యాటర్లు ఔట్ కావడమనేది అసాధారణ విషయం. ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో ఇది జరిగింది.
Updated on: Dec 18, 2022 | 5:10 PM

Aus Vs Sa

బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న టెస్టు రెండు రోజుల్లోనే ముగిసింది. ఈ రెండు రోజుల్లోనే 34 వికెట్లు నేలకూలాయి. ఈ సమయంలో, రెండు జట్లలో మొత్తం 10 మంది బ్యాటర్లు డకౌట్‌గా వెనుదిరిగారు.

బ్రిస్బేన్ టెస్టులో ఖాతా తెరవకుండానే అవుట్ అయిన 10 మంది బ్యాటర్లలో నాథన్ లియాన్‌తో పాటు కెప్టెన్ పాట్ కమిన్స్, డేవిడ్ వార్నర్ , ట్రావిస్ హెడ్‌లు ఉన్నారు. ఇక సౌతాఫ్రికా జట్టులో ఎన్రిచ్ నార్కియా 2 సార్లు, రాసి వాన్ డెర్ డస్సెన్, ఖయా జోండో, కైల్ వెరీన్ , మార్కో జాన్సెన్ ఇలా మొత్తం ఆరుగురు సున్నాకే వెనుదిరిగారు.

దక్షిణాఫ్రికా తరఫున ఎన్రిచ్ నార్కియా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సున్నాకే అవుటయ్యాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో సున్నాకి ఔట్ అయిన రెండో ఆఫ్రికన్ బ్యాట్స్‌మెన్‌గా ఖయా జోండో నిలిచాడు. అదే సమయంలో, రాసి వాన్ డెర్ డస్సెన్, కివ్ వెరీన్, మార్కో జాన్సన్‌లు రెండో ఇన్నింగ్స్‌లో ఖాతా తెరవకుండానే ఔటయ్యారు

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో డేవిడ్ వార్నర్, నాథన్ లియాన్, పాట్ కమిన్స్ ఖాతా తెరవలేకపోయారు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ట్రావిస్ హెడ్ కూడా డకౌట్ అయ్యాడు.





























