AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rythu Bharosa: రైతు భరోసాపై కీలక అప్డేట్.. డబ్బులు పొందేందుకు వీళ్లు అనర్హులు.. రేవంత్ సర్కార్ డెసిషన్

రైతు భరోసా పథకం కింద తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని అందించేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ నెల 22వ తేదీ నుంచి నగదును జమ చేసేందుకు రెడీ అయింది. మూడు విడతలుగా అందించాలని నిర్ణయించింది. మొత్తం రూ.9 వేల కోట్లను రైతుల ఖాతాల్లో వేయనున్నారు.

Rythu Bharosa: రైతు భరోసాపై కీలక అప్డేట్.. డబ్బులు పొందేందుకు వీళ్లు అనర్హులు.. రేవంత్ సర్కార్ డెసిషన్
Rythu Bharosa
Venkatrao Lella
|

Updated on: Mar 16, 2026 | 7:08 AM

Share

తెలంగాణలోని రైతు భరోసా లబ్దిదారులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మార్చి 22వ తేదీ నుంచి సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించింది. మూడు విడతలుగా వీటిని అందించాలని నిర్ణయించింది. తొలి విడతలో రూ.3,590 కోట్లు అందించనుండగా.. 22వ తేదీన సిద్దిపేట జిల్లా నర్మెటలో జరిగే కార్యక్రమంలో వీటిని సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. తొలి విడతలో 73 లక్షల మంది రైతులకు అందనుండగా.. మరో 20 రోజుల తర్వాత రెండో విడతగా మరికొంతమంది రైతులకు అందించనున్నారు. ఇక మూడో విడత ఏప్రిల్ నెలాఖరులోగా జమ చేయనున్నారు. మొత్తం రూ.9 వేల కోట్ల నిధులను రైతులకు అందించనున్నారు.

వీళ్లు అనర్హులు

తెలంగాణ రాష్ట్రానికి చెందని రైతులకు రైతు భరోసా పథకం వర్తించదు. ఇక వ్యవసాయానికి అనుకూలంగా లేని బీడు, రాళ్లు రప్పలు, కొండలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, కమర్షియల్ భూములకు వర్తించదు. ఇక ధరణి పోర్టల్‌లో భూమి వివరాలు నమోదు కాకపోతే అనర్హులుగా ప్రకటిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్లు అందుకుంటున్నవారు కూడా అనర్హులు. ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించేవారు, ప్రజాప్రతినిధులకు కూడా రైతు భరోసా పథకం వర్తించదు. ఇక ఆలయాలు, ట్రస్టులు, ఇతర సంస్థల పేరుపై ఉన్న వ్యవసాయ భూములు కలిగి ఉన్నవారు కూడా అనర్హులు.

అర్హతలు ఇవే..

-తెలంగాణలో భూమి కలిగి ఉండాలి -తెలంగాణ వ్యక్తి అయి ఉండాలి -కనీసం 18 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి -దరఖాస్తుదారుడి పేరు మీద భూమి ధరణి పోర్టల్‌లో నమోదై ఉండాలి -వ్యవసాయం చేయడానికి అనుకూలమైన భూమి అయి ఉండాలి -Recognition of Forest Rights పట్టాదారులు కూడా రైతు భరోసా పథకానికి అర్హులే

కౌలు రైతులకు వస్తుందా..?

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కౌలు రైతులకు కూడా సాయం అందిస్తోంది. కౌలు రైతులకు ఏడాదికి రూ.12 వేల ఆర్ధిక సాయం అందిస్తోంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం పేరుతో దీనిని అమలు చేస్తోంది.

ఎంత సాయం అందుతుంది..?

గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎకరానికి ఏడాదికి రూ.10 వేలు అందించేవారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాయాన్ని రూ.12 వేలకు పెంచింది. ఏడాదిలో రెండు విడతలుగా వీటిని అందిస్తున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చాక కేవలం వ్యవసాయయోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా అందించాలని నిర్ణయించింది. గతంలో రైతుబంధు పేరుతో ఈ పథకం అమలవ్వగా.. ఇప్పుడు రైతు భరోసాగా మార్చారు.

Follow Us