AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SIR కొనసాగుతున్న వేళ పాతబస్తీలో కలకలం.. సంచిలో వందల కొద్దీ ఓటరు కార్డులు!

హైదరాబాద్ మహానగరం పాతబస్తీలో భారీ సంఖ్యలో ఓటర్ ఐడీ కార్డులు బయటపడటం తీవ్ర కలకలం రేపింది. జల్‌పల్లి ఫారెస్ట్ పార్క్ సమీపంలో రోడ్డు పక్కన పడేసి ఉన్న ఒక సంచిలో 500కు పైగా ఓటర్ ఐడీ కార్డులను స్థానికులు గుర్తించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఈ సంచిని అక్కడ పడేసి వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ ఓటర్ ఐడీ కార్డుల సంచిని స్వాధీనం చేసుకున్నారు.

Bag Of Voter Cards
Balaraju Goud
|

Updated on: Jul 13, 2026 | 6:38 PM

Share

హైదరాబాద్ మహానగరం పాతబస్తీలో భారీ సంఖ్యలో ఓటర్ ఐడీ కార్డులు బయటపడటం తీవ్ర కలకలం రేపింది. జల్‌పల్లి ఫారెస్ట్ పార్క్ సమీపంలో రోడ్డు పక్కన పడేసి ఉన్న ఒక సంచిలో 500కు పైగా ఓటర్ ఐడీ కార్డులను స్థానికులు గుర్తించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఈ సంచిని అక్కడ పడేసి వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ ఓటర్ ఐడీ కార్డుల సంచిని స్వాధీనం చేసుకున్నారు.

ఎన్నికల అధికారులు, పోలీసులు ఈ కార్డులను పరిశీలించగా.. ఇవన్నీ పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట నియోజకవర్గానికి చెందిన ఓటర్ ఐడీ కార్డులుగా ప్రాథమికంగా గుర్తించారు. అసలు ఇన్ని వందల కార్డులు ఒకేచోట సంచిలో ఎందుకు ఉన్నాయి? వీటిని ఎవరు, ఏ ఉద్దేశంతో ఇక్కడ పడేశారు? అనే విషయాలు ప్రస్తుతం ఉత్కంఠ రేపుతున్నాయి.

ఎన్నికల సమగ్ర ఓటర్ జాబితా సవరణ కొనసాగుతున్న సమయంలో వందల ఓటరు కార్డుల దొరకడం కలకలం సృష్టిస్తోంది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కీలకమైన ఈ ఓటర్ ఐడీ కార్డులు రోడ్డుపైకి ఎలా వచ్చాయనే కోణంలో పోలీసులు ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. పాతబస్తీలో ఒకేసారి ఇన్ని కార్డులు లభ్యం కావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్

మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..

సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..

తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్

నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!

యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్

బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..

అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి

క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?

ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!