AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీకి చేరింది కాళేశ్వరం కుస్తీ..! ప్రాజెక్టు చుట్టూ పంతం పాలిటిక్స్

తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై నీటి రాజకీయం తీవ్ర స్థాయికి చేరింది. కరువు, ఎల్ నినో ప్రభావంతో రైతులు నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ప్రాజెక్టు వైఫల్యాలు, మేడిగడ్డ బ్యారేజీ సమస్యలపై ప్రతిపక్షాలు అధికార పార్టీని నిలదీస్తున్నాయి. ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలు, నీటి నిర్వహణపై దృష్టి సారిస్తూ, రాజకీయ ఆరోపణలను తిప్పికొడుతోంది. ఈ "బ్లడీ పాలిటిక్స్" రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి.

ఢిల్లీకి చేరింది కాళేశ్వరం కుస్తీ..! ప్రాజెక్టు చుట్టూ పంతం పాలిటిక్స్
Kaleshwaram Project
SN Pasha
|

Updated on: Jul 13, 2026 | 10:10 PM

Share

కాళేశ్వరం కాదు, కొంప కొల్లేశ్వరం అని ప్రాసలతో పంచ్‌లతో పొట్టుపొట్టు తిట్టుకుంటున్న పార్టీలు ఇప్పట్లో అలసిపొయ్యేలా కనిపించడం లేదు. నీళ్లొదలండయ్యా బాబూ అని కన్నెపల్లి పంప్‌హౌస్‌ దగ్గర కేటీఆర్ పోరుబాటతో మొదలైంది రాజకీయం. బలీయమైన రైతు ఓటుబ్యాంకును కొల్లగొట్టడం కోసం అధికార ప్రతిపక్షాలు కళాత్మకంగా ఫైటింగ్‌కి దిగేశాయి. దీంతో కొత్తకొత్త కలర్లలోకి మారుతోంది కాళేశ్వరం పొలిటికల్ గ్రౌండ్. కాంగ్రెస్ పార్టీని కార్నర్ చెయ్యడానికి నెత్తురు చిందించేదాకా శ్రమిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ఏ స్పష్టమైన వైఖరీ తీసుకోకపోయినా కాళేశ్వరం బ్లడీపాలిటిక్స్‌లోకి కసిగా ఎంట్రీ ఇచ్చింది తెలంగాణ కమలదండు. తెలంగాణలో ప్రతీ కార్నర్‌లోకీ పాకింది కరువు భయం. ఎండిపోతున్న పంటపొలాలు రైతును వెక్కిరిస్తున్నాయి. ఖరీఫ్‌ సీజన్ ఆరంభసూచికగా చేసుకోవాల్సిన ఏరువాక పండగైతే పూర్తిగా అటకెక్కింది. కానీ, ఇక్కడ సాగురాజకీయం మాత్రం బహుచక్కగా సాగుతోంది. నీళ్ల నుంచి నెత్తురు వైపు మళ్లింది. బీఆర్‌ఎస్‌ నేతల నెత్తురుతో పంటలు పారించాలన్న సీఎం రేవంత్‌ కామెంట్లతో తిక్కరేగి కత్తిసాముకు దిగింది గులాబీదండు. రైతులకోసం ఎంత రక్తం చిందించడానికైనా సిద్ధమని హరీష్‌రావు ఇచ్చిన కౌంటర్‌ని మొదట్లో తేలిగ్గా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. డైరెక్టుగా రక్తపోరాటానికే దిగేసింది బీఆర్‌ఎస్. రక్తదాన శిబిరాలతో కొత్త ట్రెండ్‌ని సెట్‌ చెయ్యబోయింది. రక్తమిస్తామంటూ బీఆర్‌ఎస్ విద్యార్థి నేతలు భారీగా తరలిరావడమే కాదు, బ్లడ్‌ ప్యాకెట్స్‌తో రేవంత్‌ ఇంటికి వెళ్లబోయారు. మీ రక్తదాహం తీర్చుకో.. కానీ, మా రైతన్నలకు నీళ్లివ్వు..! అని ఫ్లెక్సీ మీద రాసిన రాతలు రూలింగ్‌పార్టీని సూటిగా...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి