AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: అమానవీయ ఘటన! అప్పుడే పుట్టిన ఆడశిశువును అపార్ట్‌మెంట్‌నుంచి విసిరేసిన కసాయి తల్లి

పురిటి వాసన కూడా వదలని అప్పుడే పుట్టిన ఆడ శిశువును ఆ తల్లి వద్దనుకుంది. అంతే.. కళ్లు కూడా తెరవని ఆ పసిబిడ్డను నిర్ధాక్షిణ్యంగా అపార్ట్‌మెంట్‌ నుంచి బయటకు విసిరేసింది. తలపగిలి, నిండా నెత్తురు కారుతున్న..

Hyderabad: అమానవీయ ఘటన! అప్పుడే పుట్టిన ఆడశిశువును అపార్ట్‌మెంట్‌నుంచి విసిరేసిన కసాయి తల్లి
child
Srilakshmi C
|

Updated on: Dec 19, 2022 | 9:56 AM

Share

పురిటి వాసన కూడా వదలని అప్పుడే పుట్టిన ఆడ శిశువును ఆ తల్లి వద్దనుకుంది. అంతే.. కళ్లు కూడా తెరవని ఆ పసిబిడ్డను నిర్ధాక్షిణ్యంగా అపార్ట్‌మెంట్‌ నుంచి బయటకు విసిరేసింది. తలపగిలి, నిండా నెత్తురు కారుతున్న బిడ్డ ఉగ్గపట్టి.. తల్లడిల్లి.. ఏడుస్తున్న బిడ్డను తీసుకుని ఎలాగైనా కాపాడాలని పరుగులు పెట్టాడు ఓ పోలీసు. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా పసిప్రాణం దక్కలేదు. ఈ విషాద ఘటన మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడ ఠాణాలో ఆదివారం (డిసెంబర్‌ 18) చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..

హైదరాబాద్ లోని కుషాయిగూడ ఏరియా కమలానగర్ లోని ఓ అపార్ట్‌మెంట్‌ ఆవరణలో నెత్తుటి మరకలతో ఉన్న పురిటిబిడ్డ గుక్కపట్టి ఏడుస్తూ కనిపించింది. అపార్ట్‌మెంట్‌ వాసులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై సాయికుమార్‌ బిడ్డను చేతుల్లోకి తీసుకుని చూడగా.. తలకు గాయమై రక్తం కారడం గమనించాడు. హుటాహుటీనా స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లాడు. బిడ్డను పరీక్షించిన వైద్యులు శిశువు పరిస్థితి విషమంగా ఉందని, వెంటనే మరో ఆసుపత్రికి తీసుకెళ్లవల్సిందిగా సూచించారు. అంబులెన్స్‌లో ఏఎస్‌రావునగర్‌లోని మరో ఆసుపత్రికి తీసుకెళ్లగా.. వారు నిలోఫర్‌కు తరలించమని సూచించారు. అక్కడ వెంటిలేటర్‌పై 5 గంటలపాటు చికిత్స అందించినా పసికందు మృతి చెందినట్లు ఎస్సై సాయికుమార్‌ మీడియాకు తెలియజేశారు. సీసీ కెమెరాల ఆధారంతో బిడ్డను ఎవరు వదిలారనే వివరాలను తెలుసుకుంటామని ఆయన తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.