AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండియా పోస్ట్‌ గిఫ్ట్స్‌ పేరిట మెసేజ్‌లు..! నమ్మి క్లిక్‌ చేశారో ఇక అంతే సంగతులు!

ఇండియా పోస్ట్-డాక్ సేవ గిఫ్ట్స్ పేరుతో సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న సందేశం నకిలీదని PIB హెచ్చరించింది. బహుమతులు ఆశ చూపి, లింక్‌లు క్లిక్ చేయమని సైబర్ నేరగాళ్లు ప్రజల వ్యక్తిగత వివరాలు, ఆధార్, బ్యాంక్ సమాచారం దొంగిలిస్తున్నారు. ఇలాంటి నకిలీ ప్రకటనలు నమ్మవద్దు. అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయవద్దు.

ఇండియా పోస్ట్‌ గిఫ్ట్స్‌ పేరిట మెసేజ్‌లు..! నమ్మి క్లిక్‌ చేశారో ఇక అంతే సంగతులు!
India Post Scam
SN Pasha
|

Updated on: Mar 16, 2026 | 4:11 AM

Share

సామాజిక మాధ్యమాల్లో ఇండియా పోస్ట్‌ – డాక్ సేవ గిఫ్ట్స్‌ పేరిట ఒక సందేశం వేగంగా వ్యాపిస్తోంది. ఆ సందేశంలో ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేస్తే ప్రత్యేక బహుమతులు, రివార్డులు పొందవచ్చని పేర్కొంటున్నారు. అయితే ఇది పూర్తిగా నకిలీ ప్రచారం అని అధికారులు స్పష్టం చేశారు. ఈ విషయంపై ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరోకు చెందిన ఫ్యాక్ట్ చెక్ విభాగం హెచ్చరిక జారీ చేసింది. ఈ సందేశాలకు ఇండియా పోస్ట్‌ లేదా తపాలా శాఖతో ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. ప్రజలను మోసం చేయడానికి సైబర్ నేరగాళ్లు ఇలాంటి తప్పుడు ప్రకటనలను ఉపయోగిస్తున్నారని పేర్కొంది.

అధికారుల ప్రకారం బహుమతుల పేరుతో పంపే ఈ లింకులు క్లిక్ చేస్తే వినియోగదారుల వ్యక్తిగత వివరాలను దొంగిలించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఆధార్ వివరాలు, ఓటీపీలు, బ్యాంకు ఖాతా సమాచారం వంటి సున్నితమైన డేటాను సేకరించడానికి సైబర్ నేరగాళ్లు ఇలాంటి పద్ధతులను ఉపయోగిస్తారు. అందువల్ల అనుమానాస్పదంగా కనిపించే లింకులు లేదా వెబ్‌పేజీలను క్లిక్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలని పీఐబీ సూచించింది. సామాజిక మాధ్యమాల్లో వచ్చే అనధికార ప్రకటనలను నమ్మకూడదని కూడా తెలిపింది.

ఏదైనా ఆఫర్ లేదా పథకం గురించి సందేహం ఉంటే సంబంధిత శాఖ అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే సందర్శించాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటే ఇటువంటి సైబర్ మోసాల నుంచి రక్షణ పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us