Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Startups: కొత్త అంకురాలకు స్వర్గధామంగా మారిన 5 రాష్ట్రాలు.. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల ప్లేస్ ఎక్కడా?

నవంబర్ 30 వరకూ ఉన్న లెక్కల ప్రకారం దేశంలో ప్రభుత్వం గుర్తించిన 84,012 స్టార్టప్ లలో 60 శాతం మహారాష్ట్ర, కర్నాటక, ఢిల్లీ, గుజరాత్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లోనే కేంద్రీకరింపబడి ఉన్నాయి.

New Startups: కొత్త అంకురాలకు స్వర్గధామంగా మారిన 5 రాష్ట్రాలు.. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల ప్లేస్ ఎక్కడా?
Startup India
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Narender Vaitla

Updated on: Dec 19, 2022 | 2:54 PM

దేశంలో స్టార్టప్ ఇండియా కొత్త విప్లవాన్ని సృష్టిస్తోంది. దీని ద్వారా వివిధ రంగాలకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు దాదాపు 84,012 స్టార్టప్ లను ప్రారంభించారు. ప్రభుత్వం గుర్తించిన ఈ స్టార్టప్ లలో దాదాపు 58 శాతం కేవలం ఐదు రాష్ట్రాల పరిధిలోనే ఉన్నాయి. నవంబర్ 30 వరకూ ఉన్న లెక్కల ప్రకారం దేశంలో ప్రభుత్వం గుర్తించిన 84,012 స్టార్టప్ లలో 60 శాతం మహారాష్ట్ర, కర్నాటక, ఢిల్లీ, గుజరాత్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లోనే కేంద్రీకరింపబడి ఉన్నాయి. అన్నింటి కన్నా ఎక్కువగా మహారాష్ట్రాలో 15,571 స్టార్టప్స్ ఉండగా.. కర్నాటకలో 9,904, ఢిల్లీలో 9,588, ఉత్తరప్రదేశ్ లో 7,719, గుజరాత్ లో 5, 877 స్టార్టప్ లను నెలకొల్పారు.

అసలు ఏంటి ఈ స్కీమ్..

స్టార్టప్ ఇండియా.. దేశంలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీమ్ ఇది. దేశ వ్యాప్తంగా దీని ద్వారా స్టార్టప్ లకు మంచి అనుకూల వాతావరణం కల్పించడంతో పాటు వారికి అవసరమైన అన్ని వనరులు సమకూర్చేందుకు ప్రభుత్వం దీనిని 2016 జూన్ లో ప్రవేశపెట్టింది. అనేకమంది దీనిని ఉపయోగించుకుంటూ తమ స్టార్టప్లను ఆవిష్కరించి, ఉన్నత స్థాయిలో రాణిస్తున్నారు.

మూడు విధానాల్లో ప్రోత్సాహకాలు..

స్టార్టప్ ఇండియా స్కీమ్ లో మూడు రకాలుగా ఔత్సాహికులకు ప్రోత్సాహకాలు అందిస్తారు. మొదటిది సింప్లిఫికేషన్ అండ్ హోల్డింగ్, రెండోది ఫండింగ్ సపోర్ట్ అండ్ ఇన్సెంటివ్స్, మూడోది ఇండస్ట్రీ, అకాడమియా పార్టనర్ షిప్ అండ్ ఇంకుబేషన్.

ఇవి కూడా చదవండి

ఆర్థిక చేయూత..

ఈ స్టార్టప్ ఇండియా స్కీమ్ లో వివిధ దశల్లో ఉన్న స్టార్ట్ అప్ లకు ఆర్థిక సాయం అందిస్తారు. ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్స్(ఎఫ్ఎఫ్ఎస్), అలాగే స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్(ఎస్ఐఎస్ఎఫ్ఎస్). ఈ రెండు స్కీమ్ లను పాన్ ఇండియా స్థాయిలో అమలు చేస్తున్నారు.

– ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్స్(ఎఫ్ఎఫ్ఎస్) స్కీమ్ ను 2016 జూన్ 16 న ప్రారంభించరు. 14, 15వ ఫైనాన్స్ కమిషన్ నుంచి రూ. 10,000 కోట్ల కార్పస్ ను తీసుకొని, స్టార్టప్ ల వ్యవస్థకు జవసత్వాలు కల్పించేందుకు కేటాయించారు. దీనిలో 2022 నవంబర్ 30 నాటికి రూ. 7,527.95 కోట్లు వివిధ స్టార్టప్ ల కోసం వెచ్చించినట్లు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ తెలిపింది.

– అలాగే స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్(ఎస్ఐఎస్ఎఫ్ఎస్) కింద డైరెక్ట్ గా స్టార్టప్ లో పెట్టుబడి పెట్టకుండా సెబీ రిజిస్టర్డ్ అల్టర్ నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్(ఏఐఎఫ్) నుంచి ఆర్థిక సాయం అందించేలా ఏర్పాట్లు చేశారు. దీని ద్వారా 2022 నవంబర్ 30 నాటికి రూ. 455.25కోట్లు మంజూరు చేసి 126 ఇంకుబేటర్స్ కోసం రూ. 186.15 ఖర్చు చేశారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..