Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cibil Score: ఈ సింపుల్ టిప్స్ తో మీ సిబిల్ స్కోర్ అమాంతం పెరిగిపోతుంది! చదవకపోతే మిస్ అవుతారు!

ఈ నేపథ్యంలో అసలు సిబిల్ స్కోర్ అంటే ఏమిటి? దీనిని ఎలా మెయింటేన్ చేయాలి? సిబిల్ స్కోర్ పెరగాలి అంటే ఏం చేయాలి? వంటి వివరాలను ఇప్పుడు తెలుకుందాం..

Cibil Score: ఈ సింపుల్ టిప్స్ తో మీ సిబిల్ స్కోర్ అమాంతం పెరిగిపోతుంది! చదవకపోతే మిస్ అవుతారు!
Cibil Score
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Dec 19, 2022 | 11:28 AM

కోవిడ్ కారణంగా చాలా మంది ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నారు. అన్ని వ్యవస్థల మీద కోవిడ్ ప్రభావం చూపడంతో చాలా కుటుంబాలను ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. అటువంటి సమయంలో ప్రతి ఒక్కరూ లోన్లు తీసుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో వివిధ రకాల లోన్లు తీసుకునే వారి సంఖ్య కోవిడ్ తర్వాత గణనీయంగా పెరిగింది. అయితే ఈ లోన్లు బ్యాంకర్లు ఇవ్వాలంటే ఆ వ్యక్తి క్రెడిట్ రిపోర్టు బాగా ఉండాలి. దీనిని బ్యాంకర్ల పరిభాషలో సిబిల్ స్కోర్ అంటారు. ఇది అధికంగా ఉంటేనే బ్యాంకర్లు లోన్ ఇచ్చేందుకు ఆసక్తి చూపుతారు. ఈ నేపథ్యంలో అసలు సిబిల్ స్కోర్ అంటే ఏమిటి? దీనిని ఎలా మెయింటేన్ చేయాలి? సిబిల్ స్కోర్ పెరగాలి అంటే ఏం చేయాలి? వంటి వివరాలను ఇప్పుడు తెలుకుందాం..

సిబిల్ స్కోర్ అంటే..

సిబిల్ స్కోర్ అంటే మూడంకెల నంబర్.. సాధారణంగా 300 నుంచి 900 మధ్య ఉంటుంది. ఈ నంబరే లోన్లు ఇచ్చేందుకు బ్యాంకర్లు ప్రామాణికంగా తీసుకుంటాయి. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లిమిటెడ్ వంటి సంస్థలు మన ఇండియాలో సిబిల్ స్కోర్ ను నిర్వహిస్తుంటాయి.

అవసరమైన సిబిల్ స్కోర్ ఎప్పుడు వస్తుంది..

సాధారణంగా సిబిల్ స్కోర్750 పైన ఉంటే బ్యాంకర్లు లోన్లు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతారు. అయితే ఇది ఒక్క రోజులో వచ్చేది కాదు. మంచి సిబిల్ సిద్ధమవడానికి దాదాపు 18 నుంచి 36 నెలల సమయం పడుతుంది. చాలా అంశాలు దీనిపై ఆధారపడి ఉంటాయి. మీరు చేసే ఖర్చులు, లోన్లను తిరిగే చెల్లించే విధానం, క్రెడిట్ కార్డుల వినియోగం తదితర అంశాలపై ఈ సిబిల్ స్కోర్ పెరగడం, తరగడం జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

రాబడి కన్నా ఖర్చులు ఎక్కువ ఉండకూడదు..

మంచి సిబిల్ స్కోర్ ఉండాలంటే ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. మీకు ఉన్న రాబడి కి అనుగుణంగా ఖర్చులు ఉండాలి. రాబడి కన్నా ఖర్చులు అధికమైతే అప్పుడు సిబిల్ స్కోర్ ప్రభావితం అవుతుంది.

క్రెడిట్ కార్డ్ బిల్లలు క్రమం తప్పకుండా కట్టాలి..

సిబిల్ స్కోర్ అధికంగా ఉండాలంటే మొదట చేయాల్సినది క్రెడిట్ కార్డు బిల్లలు క్రమం తప్పకుండా కట్టడం. ఎట్టి పరిస్థితుల్లోనూ డ్యూడేట్ మిస్ అవ్వకూడదు. క్రెడిట్ కార్డుపై లోన్లు ఏమైనా ఉంటే వాటి ఈఎంఐ కూడా నిర్ణీత గడువులోగా కట్టేయాలి. లేకుంటే ఇవి సిబిల్ స్కోర్ ను దారుణంగా దెబ్బతీస్తాయి.

లోన్లు ఎక్కువ తీసుకోవద్దు..

అవసరానికి అధిక సంఖ్యలో లోన్లు తీసుకోవడం కూడా మంచిది కాదు. ముఖ్యంగా అసురక్షిత లోన్లయిన పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డు లోన్లు తగ్గించాలి. అవసరమైతే సురక్షిత లోన్లయిన హోమ్ లోన్, ఎడ్యూకేషన్ లోన్, ఆటో లోన్ లవంటివి తీసుకోవచ్చు. అలాగే ఒకే సారి రెండు మూడు లోన్లు కూడా తీసుకోకపోవడం ఉత్తమం.

సిబిల్ రిపోర్ట్ చెక్ చేసుకోండి..

మీ సిబిల్ రిపోర్ట్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. దీని వల్ల ఎక్కడ తప్పు జరుగుతుందో గమనించుకొని దానిని అధిగమించే అవకాశం ఉంటుంది. మీకు www.cibil.com నుంచి సిబిల్ రిపోర్టు ను పొందవచ్చు. అలాగే మీకున్న ఇతర లోన్ ఈఎంఐలు విధిగా షెడ్యూల్ ప్రకారం కట్టేయాలి. అవకాశం ఉన్నంత వరకూ జాయింట్ అకౌంట్ తో లోన్ లు తీసుకోకపోవడం ఉత్తమం. లేదా ఇతరుల లోన్ లకు షూరిటీ గా కూడా ఉండకపోవడం మేలు. వారు సక్రమంగా ఆ లోన్ చెల్లించకపోతే మీ సిబిల్ స్కోర్ కూడా దెబ్బతింటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..