Andhra Pradesh: ఏపీకి భారీ పెట్టుబడులు.. ఫెసిలిటీ సెంటర్ కోసం రూ.184.12 కోట్లు

ఏపీలో మరో దిగ్గజ కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఐటీ హబ్ గా మారుతన్న విశాఖలో అమెజాన్ సంస్థ తన డెవలప్ మెంట్, ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేసేందుకు..

Andhra Pradesh: ఏపీకి భారీ పెట్టుబడులు.. ఫెసిలిటీ సెంటర్ కోసం రూ.184.12 కోట్లు
Andhra Pradesh
Follow us
Subhash Goud

|

Updated on: Dec 19, 2022 | 4:34 PM

ఏపీలో మరో దిగ్గజ కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఐటీ హబ్ గా మారుతన్న విశాఖలో అమెజాన్ సంస్థ తన డెవలప్ మెంట్, ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఫెసిలిటీ సెంటర్ కోసం విశాఖలో రూ.184.12 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అమెజాన్ పెట్టుబడుల కోసం ప్రాథమిక నిర్ణయం పూర్తయి సాఫ్టవేర్ టెక్నాలజీ పార్స్క్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకుంది. కొత్త సంవత్సరంలో నూతన ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు పనులు ప్రారంభించనున్నట్లు ప్రభుత్వానికి వివరించింది. ఈ మేరకు అమెజాన్ సంస్థ పెట్టుబడులపై సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా స్వయంగా ట్వీట్ చేసింది. డెవలప్ మెంట్ సెంటర్, ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటుతో ఐటీ ఉద్యోగాలతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.

అయితే అమెజాన్‌ వంటి ప్రముఖ కంపెనీ విశాఖలో పెట్టుబడులు పెట్టడం మరిన్ని కంపెనీల ఏర్పాటుకు మార్గాన్ని క్లియర్‌ చేసినట్లయింది. వచ్చే ఏడాది జనవరిలో విశాఖపట్నం కేంద్రంగా ఐటీ సదస్సు, ఫిబ్రవరిలో గ్లోబల్‌ టెక్నాలజీ సదస్సులు జరుగనున్న నేపథ్యంలో మరిన్ని ఐటీ కంపెనీలు రాష్ట్రంలోకి వచ్చే అవకాశం ఉందని ఎస్‌టీపీఐ విశాఖ డైరెక్టర్‌ సీవీడి రామ్‌ప్రసాద్‌ తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి