Samsung Galaxy M04: గుడ్‌న్యూస్‌.. శాంసంగ్‌ నుంచి 8జీబీ ర్యామ్‌తో సూపర్-ఫాస్ట్ స్మార్ట్‌ఫోన్.. అతి తక్కువ బడ్జెట్‌లోనే..

దాదాపు రెండు సంవత్సరాల తర్వాత శాంసంగ్‌ చివరకు తన సరికొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ Samsung Galaxy M04ని విడుదల చేసింది. ఈ ఫోన్‌ 8GB ర్యామ్‌+తో అందిస్తోంది. గెలక్స్‌..

Samsung Galaxy M04: గుడ్‌న్యూస్‌.. శాంసంగ్‌ నుంచి 8జీబీ ర్యామ్‌తో సూపర్-ఫాస్ట్ స్మార్ట్‌ఫోన్.. అతి తక్కువ బడ్జెట్‌లోనే..
Samsung Galaxy M04
Follow us
Subhash Goud

|

Updated on: Dec 19, 2022 | 1:39 PM

దాదాపు రెండు సంవత్సరాల తర్వాత శాంసంగ్‌ చివరకు తన సరికొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ Samsung Galaxy M04ని విడుదల చేసింది. ఈ ఫోన్‌ 8GB ర్యామ్‌+తో అందిస్తోంది. గెలక్స్‌ ఎం04 సూపర్ ఫాస్ట్, 1 టీబీ వరకు పెంచుకునే సదుపాయం ఉంది. దీని స్టోరేజీ 128GB స్టోరేజ్, 2 సంవత్సరాల OS అప్‌డేట్‌లు, 5000mAh బ్యాటరీ, 16.55cm (6.5”) స్క్రీన్ ఉంటుంది. ఇక దీని కెమెరా 13ఎంపీ డ్యూయల్ కెమెరా వంటి ఇతర ముఖ్యమైన ఫీచర్‌లు ఉన్నాయి. ఇది సాధారణ ఉపయోగం కోసం ఆకట్టుకునే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌గా చేస్తుంది. ఇందులో ఆకట్టుకునే ఫీచర్స్‌ ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్‌లోని ఈ సెగ్మెంట్-లీడింగ్ ఫీచర్ వినియోగదారులకు పూర్తి సులభంగా ఎక్కువ యాప్‌లను వేగంగా చేయడంలో ముందుంటుంది. దీని ర్యామ్‌ వేగంగా ఉంటుంది.

ఆకట్టుకునే 2 సంవత్సరాల ఓఎస్‌ అండ్‌ సెక్యూరిటీ అప్‌డేట్‌లు

వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లను కంపెనీ అందించిన తాజా అప్‌డేట్‌లు చాలా ముఖ్యం. రెండు సంవత్సరాల ఓఎస్‌, నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌తో వస్తుంది. దీర్ఘకాలంలో మీ ఫోన్ పనితీరు, బగ్ పరిష్కారాల నుండి మీరు ఉపశమనం పొందవచ్చు.

128జీబిని 1టీవీ వరకు విస్తరించుకోవచ్చు

ఈ ఫోన్‌128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీతో ఉంటుంది. అయితే దీనిని 1000జీబీల వరకు విస్తరించుకునే వెసులుబాటు ఉంది. దీని వల్ల మీరు ఫోటోలు, వీడియోలు మరింతగా స్టోరేజీ చేసుకునే అవకాశం దక్కుతుంది. యాప్‌లను డౌన్‌లోడ్ చేస్తున్నప్పుడు లేదా వాటి ద్వారా నావిగేట్ చేస్తున్నప్పుడు, ఫోన్ వేగంగా పనిచేసేలా చేయడంలో కూడా ఇది సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

శక్తివంతమైన 5000mAh బ్యాటరీ

ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్ వినియోగం ఎక్కువైపోతోంది. ఉదయం లేచింది నుంచి రాత్రి వరకు ఎంతో మంది స్మార్ట్‌ఫోన్‌లతో ఉండిపోతున్నారు. ఉద్యోగులు కూడా తమ విధి నిర్వహణలో భాగంగా ఎక్కువగా వినియోగిస్తున్నారు. చాటింగ్ చేయడం, సోషల్ మీడియాను ఉపయోగించడం లేదా మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు మెయిల్ చేయడం వంటి వృత్తిపరమైన ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నవారు ఎందరో ఉన్నారు. దీంతో ఈ ఫోన్‌లో ఎక్కువ బ్యాటరీ బ్యాకప్‌ వచ్చేలా బ్యాటరీని రూపొందించింది కంపెనీ. ఇందులో 5000mAh బ్యాటరీ ఉంటుంది.

డిస్‌ప్లే:

ఈ ఫోన్‌ డిస్‌ప్లే 16.55 సెంమీ. వరకు ఉంటుంది. ఇది హెచ్‌డీ+డిస్‌ప్లేతో ఉంటుంది. అలాగే వీడియోలను హెచ్‌డీ నాణ్యతతో చూడవచ్చు. అలాగే వీడియో కాలింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది.

కెమెరా:

నేటి ప్రపంచంలో మీ సోషల్‌ల కోసం అద్భుతమైన చిత్రాలను క్యాప్చర్ చేయలేని ఫోన్‌ను ఎవరూ ఇష్టపడరు. Galaxy M04 13MP డ్యూయల్ రియర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరాను అందించింది కంపెనీ.

MTK P35 ప్రాసెసర్ అండ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్

ఈ ఫోన్‌కు MediaTek Helio P35 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 12 OS కారణంగా స్మార్ట్‌ఫోన్ సామర్థ్యం మరింత మెరుగుపర్చింది. ప్రాసెసర్, OS రెండూ మెరుగైన పనితీరుకు దోహదం చేస్తాయి.

డిసెంబర్ 16 మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభమైన సేల్ సమయంలో రూ.8,499 ప్రారంభమయ్యే కొత్త Samsung Galaxy M04ని సొంతం చేసుకోవచ్చు. ఇందులో 4GB + 64GB వేరియంట్ రూ. 8,499 (బ్యాంక్ ఆఫర్‌తో సహా) అందుబాటులో ఉండగా, 4GB + 128GB వేరియంట్ రూ.9,499 (బ్యాంక్ ఆఫర్‌తో సహా) వద్ద అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌ అమెజాన్‌, శాంసంగ్‌ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి