WhatsApp: ఎక్సలెంట్ ఫీచర్.. ‘డిలీట్ ఫర్ ఎవ్రీవన్‌’కి బదులుగా ‘డిలీట్ ఫర్ మీ’ చేశారా.. నో వర్రీ

మెటా యాజమాన్యంలోని వాట్సాప్‌ వరుస ఫీచర్‌లతో దూసుకుపోతోంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్‌ అప్‌డేట్‌లను అందిస్తూ యూజర్‌లను ఆకట్టుకుంటోంది. తాజాగా మరో క్రేజీ ఫీచర్ తీసుకొచ్చింది.

WhatsApp: ఎక్సలెంట్ ఫీచర్.. 'డిలీట్ ఫర్ ఎవ్రీవన్‌'కి బదులుగా 'డిలీట్ ఫర్ మీ' చేశారా.. నో వర్రీ
Whatsapp News Feature
Follow us

|

Updated on: Dec 19, 2022 | 5:30 PM

ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు పక్కాగా వాట్సాప్ యూజ్ చేస్తారు. మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ చాలా యూజర్ ఫ్రెండ్లీ. వరస ఫీచర్లలో యూజర్ల అభిమానాన్ని చూరగొంటుంది వాట్సాప్. తాజాగా సోమవారం మరో క్రేజీ ఫీచర్‌తో ముందుకొచ్చింది. ‘యాక్సిడెంటల్ డిలీట్’ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. మనం పంపాలనుకున్న వ్యక్తికి లేదా గ్రూప్‌కు కాకుండా మరొకరికి మెసేజ్ పంపి, పొరపాటున డిలీట్ ఫర్ ఎవ్రీవన్‌కి బదులుగా ‘డిలీట్ ఫర్ మీ’పై క్లిక్ చేయడం జరుగుతూ ఉంటుంది. దీంతో అవతలి వారికి ఈ మెసేజ్ కనిపిస్తూనే ఉంటుంది. దీని వల్ల కొన్నిసార్లు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ అసౌకర్యాన్ని గుర్తించింది వాట్సాప్.

ఈ సమస్యను పరిష్కరించడానికి, యాక్సిడెంటల్ డిలీట్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. యాక్సిడెంటల్‌గా డిలీట్ ఫర్ మీ చేసిన మెసేజ్‌ను రివర్స్ చేయడానికి ఐదు సెకన్ల సమయాన్ని అందిస్తుంది. ఈ సమయంలో మీరు అన్ డూ(Undo) చేస్తే.. మళ్లీ యధావిధిగా మెసేజ్ వచ్చేస్తుంది. అప్పుడు మనం ‘డిలీట్ ఫర్ ఎవ్రీవన్’ చేసేందుకు వీలుంటుంది. యాక్సిడెంటల్ డిలీట్ ఫీచర్ ఆండ్రాయిడ్,  ఐఫోన్ డివైజులు వాడుతున్న వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటుంది.

గత నెలలో, ఇండియాలో కొత్తగా ‘మెసేజ్ యువర్ సెల్ఫ్’ ఫీచర్‌ను తీసుకొచ్చింది వాట్సాప్. దీని ద్వారా యూజర్ తనకు తానే మెసేజ్ పంపుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా నోట్స్, రిమైండర్స్, అప్‌డేట్స్, ఫైల్స్ సేవ్‌ చేసుకొవచ్చు. వాట్సాప్‌ను నోట్‌ప్యాడ్‌గా యూజ్ చేసుకోవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ