Indian Railways: దేశంలో తొలిసారి రైలు ఎప్పుడు పరుగులు పెట్టిందో తెలుసా? రైల్వేలో అన్ని రికార్డులే.. ఎన్నో ఆసక్తికర విషయాలు
దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ ఏదీ అంటే అది రైల్వే అనే చెప్పక తప్పదు. ప్రతి రోజు లక్షలాది మంది తమ తమ గమ్యస్థానాలకు వెళ్తుంటారు. సామాన్యులు సైతం రైలు ప్రయాణాన్ని..
దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ ఏదీ అంటే అది రైల్వే అనే చెప్పక తప్పదు. ప్రతి రోజు లక్షలాది మంది తమ తమ గమ్యస్థానాలకు వెళ్తుంటారు. సామాన్యులు సైతం రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటాడు. ఎందుకంటే రవాణా ఛార్జీలకంటే రైలు ఛార్జీలు తక్కువగా ఉండటం. దీని కారణంగా ప్రతి రోజు రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో రద్దీగా ఉంటాయి. ఇక రైల్వేకు సంబంధించిన అన్ని విషయాలు కూడా ఆసక్తికరంగానే ఉంటాయి. ఇక మొట్టమొదటిగా రైలు ఎక్కడి నుంచి పరుగులు తీసిందో తెలుసా..? అలాంటి విషయాన్ని మీకు చెప్ప బోతున్నాము. 1853 ఏప్రిల్ 16న భారతదేశంలో మొదటి ప్యాసింజర్ రైలు పట్టాలపై ఎక్కి పరుగులు పెట్టినట్లు రైల్వే నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం ప్రతి రోజు 2 కోట్లకుపైగా ప్రయాణికులకు సేవలను అందిస్తోంది భారత రైల్వే శాఖ. సరిగ్గా 169 ఏళ్ల కిందట ఇదే రోజున ముంబైలో మొదటి ప్యాసింజర్ రైలు నడిచింది. ముంబైలోని బోరీ బుందర్ నుంచి థానే మధ్య మొట్టమొదటి రైలు నడిచినట్లు రైల్వే చరిత్ర చెబుతోంది.
1853 ఏప్రిల్ 16న ముంబైలోని బోరీ బుందర్ నుంచి థానే మధ్య 34 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తూ ఈ రైలును ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రయాణికులకు సేవలు అందిస్తున్న రైల్వే అనేక రికార్డులను సృష్టించింది. అంతేకాదండోయ్.. 1998లో పురాతన రన్నింగ్ స్టీమ్ లోకోమోటీవ్ ద్వారా ప్రయాణికులకు సేవలు అందిస్తున్న గిన్నీస్ బుక్ ఆఫ్ వార్డ్ రికార్డ్స్ ఫెయిరీ క్వీన్ ఇన్ ఇండియా అని గుర్తింపు లభించింది.
ఏడాదికి 822 కోట్ల మంది ప్రయాణం
రైల్వే ద్వారా ప్రతి ఏడాది 822 కోట్ల మంది ప్రయాణికులు రైల్వే సేవలను వినియోగించుకుంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంతో దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థగా రికార్డు సృష్టించింది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే అధికారికంగా 1853 తొలి రైలు పరుగులు తీసినదానికంటే 1851 డిసెంబర్‌లో రూర్కీలో రైలును నడిపారట. భారతదేశంలోని రైల్వే వ్యవస్థ అన్ని రాష్ట్రాలు, దిక్కులను కవర్ చేసేలా నెట్‌వర్క్ విస్తరించి ఉంది. దేశంలో మొత్తం 7137కుపైగా రైల్వే స్టేషన్‌లు ఉన్నట్లు తెలుస్తోంది.
అతిపెద్ద పేరున్న రైల్వే స్టేషన్ ఎక్కడుందో తెలుసా?
అరక్కోణం -రేణిగుండ సెక్షన్‌లో అతిపెద్ద పేరుతో ఉన్న రైల్వే స్టేషన్ ఉంది. దీని పేరే ‘వెంకటనరసింహరాజువారిపేట’. ఇది భారతదేశంలోని తమిళనాడు సరిహద్దుతో ఆంధ్ర ప్రదేశ్ రాష్టంలోని రైల్వే స్టేషను. ఈ స్టేషను పేరు భారతీయ రైల్వేలోని అన్నిరైల్వే స్టేషన్ పేర్లలో అతి పొడవైనదిగా ప్రత్యేకతను కలిగి ఉంది. ఇది దక్షిణ రైల్వే మండలం లోని రేణిగుంట – అరక్కోణం రైలు మార్గములో ఉంది.
చిన్న పేరుతో రైల్వే స్టేషన్ ఎక్కడుంది?
ఇక చిన్న పేరుతో ఉన్న రైల్వే స్టేషన్ కూడా భారత్‌లో ఉంది. ఝార్సుగూడ సమీపంలో హౌరా-నాగ్‌పూర్ మెయిన్‌లైన్‌లో ఈ రైల్వే స్టేషన్ ఉంది. ఈ స్టేషన్ పేరు ఎల్‌బీ. ఇండియాలోని రైల్వే స్టేషన్‌లతో పోలిస్తే ఈ పేరు అతి చిన్నది.
దేశంలో ఎన్ని రైల్వే జోన్లు ఉన్నాయి?
ప్రస్తుతం భారతదేశంలో 18 రైల్వే జోన్లు, 70 డివిజన్లు ఉన్నాయి. భారత రైల్వే నెట్‌వర్క్ 66,030 కిలోమీటర్లు ఉంది. దేశంలో దాదాపు 7500 స్టేటషన్‌లు ఉన్నాయి. 2011 నాటికి రైల్వేల వద్ద 2,40,000 వ్యాగన్లు, 69,000 కోచ్‌లు, 9000 ఇంజిన్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ సంఖ్య మరింతగా పెరిగింది. ఇక 2015 లెక్కల ప్రకారం.. ప్రపంచంలో భారీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న సంస్థల్లో భారతీయ రైల్వేది 8వ స్థానం. రైల్వేలో దాదాపు 13 లక్షలకుపైగా ఉద్యోగాలున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.
ఈ రైలు నాలుగు రోజుల పాటు ప్రయాణిస్తుంది
ఇక భారతీయ రైల్వేలో వివేక్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఓ ప్రత్యేకత ఉంది. అసోంలోని దిబ్రుగఢ్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారికి 4,273 కిలోమీటర్లు. ఈ రైలు సుమారు నాలుగు రోజుల పాటు ప్రయాణిస్తుందట.
అతి వేగంగా ప్రయాణించే రైలు
న్యూ ఢిల్లీ- భోపాల్ మధ్య నడిచే శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు అత్యంత వేగంగా ప్రయాణిస్తుందట. గంటకు సుమారు 150 కిలోమీటర్ల వేగంగా ప్రయాణిస్తుంది. ఇటీవల ప్రారంభమైన ఓ ట్రైయిన్ కూడా గంటకు 200 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
అతి పొడవైన ప్లాట్ ఫామ్ ఎక్కడుందో తెలుసా?
భారతతదేశంలోని రైల్వే వ్యవస్థలో అన్ని విషయాలు ఆసక్తికరంగానే ఉంటాయి. దేశంలో అతి పొడవైన రైల్వే ప్లాట్ ఫామ్ కూడా ఉంది. అది ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ఉంది. ఈ ప్లాట్ ఫామ్ దాదాపు రూ.1366 మీటర్లు. అంటే ఒక కిలోమీటర్ కన్న ఎక్కువే. ఇలా చెప్పుకుంటూ పోతే రైల్వే వ్యవస్థలో అన్ని ఆసక్తికరంగానే ఉంటాయి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మరెన్నో ఉంటాయి. ఇందులో మీకు కొన్నింటిని మాత్రమే తెలియజేస్తున్నాయి. ఈ విషయాలన్ని రైల్వే లెక్కలు, ఇతర నివేదికల ఆధారంగా అందించడం జరిగింది.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి