Eco-friendly wedding: రైతు వినూత్న ఆలోచన.. ఎడ్లబండిలో ఊరేగింపు.. గిఫ్ట్‌గా మేలు జాతి ఆవు..
ఇటీవల వివాహాలు ఏ రేంజ్‌లో జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే. వధూవరులు, వారి కుటుంబ సభ్యులు కూడా తమ ఇంట జరిగే వివాహం చాలా ప్రత్యేకంగా ఉండాలని భావిస్తున్నారు..
ఇటీవల వివాహాలు ఏ రేంజ్‌లో జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే. వధూవరులు, వారి కుటుంబ సభ్యులు కూడా తమ ఇంట జరిగే వివాహం చాలా ప్రత్యేకంగా ఉండాలని భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఎంతో గ్రాండ్‌గా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పూర్వం పెళ్లిళ్లు వధూవరుల ఇంటిముందో, లేకపోతే దేవుడి ఆలయంలోనో జరిగేవి. పెళ్లికి బంధువులతోపాటు వధూవరులను కూడా ఎడ్లబండిలో ఊరేగింపుగా కళ్యాణవేదిక వద్దకు తీసుకెళ్ళేవారు. కాలక్రమేణా అది కొత్త పుంతలు తొక్కి కారు నుంచి విమానం వరకూ వెళ్లింది. ఇదిలా ఉంటే గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తి తమ కుమార్తె వివాహంతో మళ్లీ పూర్వపు రోజుల్ని గుర్తుచేసారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.సూరత్‌కు చెందిన విపుల్ పటేల్ అనే రైతు తన కుమార్తె రిద్ధి వివాహాన్ని ఘనంగా చేయాలనుకున్నాడు. అంతేకాదు ఆ పెళ్లి ఓ సందేశాత్మకంగా ఉండాలనుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే ప్లాన్ చేసుకున్నాడు. ఈ క్రమంలో తులసి విత్తనాలతో కూడిన శుభలేఖలు అచ్చు వేయించాడు. వాటిని బంధువులందరికీ పంచి, ఆ విత్తనాలను మట్టిలో నాటి పెంచాల్సిందిగా వారికి సూచించాడు. ఇక పెళ్లి సమయంలో వధూవరులను మండపానికి తీసుకురావడానికి ఎడ్ల బండినే వాహనంగా వాడాడు. అందంగా అలంకరించిన ఎడ్లబండిలో వధూవరులను ఊరేగింపుగా కళ్యాణమండపానికి తీసుకొచ్చాడు. తన కుమార్తెను కన్యాదానం చేస్తూ కానుకగా ఒక గిర్ జాతి ఆవును ఇచ్చాడు. అంతేకాదు, పెళ్లి విందులో కూడా తన ప్రత్యేకతను చాటుకున్నాడు ఈ రైతు. పూర్తిగా సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన ఉత్పత్తులతోనే వంటకాలు తయారు చేయించి భోజనాలు ఏర్పాటు చేశాడు. తినే కంచాలు, నీళ్ల గ్లాసులు సహా ప్రతి చిన్న విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాడు విపుల్ పటేల్. ఇక ఈ వివాహానికి హాజరైన బంధు మిత్రులు పటేల్ ప్రయత్నాన్ని ఎంతగానో మెచ్చుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..