Technology: ఓర్నీ.. టెక్నాలజీని ఇలా కూడా వాడతారా..! నడుస్తున్న కారులో స్టీరింగ్ వదిలేసి జూదం ఆడుతున్న యువకులు..
టెక్నాలజీని విచ్చలవిడిగా వాడుకోండి... కానీ ఇష్టంవచ్చినట్లు వాడకండి. అలా చేస్తే ఇలాగే జరుగుతుంది. ఏదైనా ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగిస్తేనే ప్రయోజనం ఉంటుంది. లేదంటే ప్రమాదాలాకు దారితీస్తుంది. అందుకు ఉదాహరణే ఈ వీడియో.
మహీంద్రా సంస్థకు చెందిన ఎక్స్‌యూవీ700 (XUV 700) మోడల్ కారు గురించి తెలుసుకదా. ఇందులో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ (ADAS) టెక్నాలజీని ఉపయోగించారు. ఇది డ్రైవర్‌కు సూచనలు చేస్తుంది. కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు అనుకోకుండా ఏదైనా అడ్డువస్తే వెంటనే డ్రైవర్‌ను అలర్ట్ చేస్తుంది. అంతేకాదు ఇందులో ఆటో డ్రైవింగ్ సౌకర్యం కూడా ఉంది. ఇంకేముంది దీనిని అదనుగా తీసుకొని కొందరు యువకులు రెచ్చిపోయారు. కారును స్టీరింగ్ వదిలేసి, ఆటో డ్రైవింగ్‌మోడ్‌లో పెట్టేసి మనోళ్లు నడుస్తున్న కారులోనే జూదం ఆడ్డం మొదలుపెట్టేశారు. కనీసం వాళ్లు సీటు బెల్ట్ కూడా పెట్టుకోలేదు. కారు ఎటుపోతుందో అనే ధ్యాసే లేదు. ఇంక ట్రాఫిక్ రూల్స్ సంగతి సరేసరి. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఈ వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. సంబంధిత అధికారులు వీరిపై చర్యలు తీసుకోవాలని కొందరంటే.. ‘ఆటో డ్రైవ్ అన్నిసార్లు పని చెయ్యకపోవచ్చు.. జాగ్రత్త బ్రదర్స్’ అంటూ మరికొందరు కామెంట్లు చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..