Viral Photo: వాసివాడి తస్సాదియ్యా.. ఈ ఫోటోలో ఎన్ని పులులు ఉన్నాయో గుర్తించగలరా.?
సాధారణంగా క్రూర జంతువులు ఏవైనా కూడా తమ వేటలో భాగం ఎరను పట్టుకునేందుకు చాటుగా పొదల మాటున దాక్కుంటాయి..

సాధారణంగా క్రూర జంతువులు ఏవైనా కూడా తమ వేటలో భాగం ఎరను పట్టుకునేందుకు చాటుగా పొదల మాటున దాక్కుంటాయి. వాటి చుట్టూ మరే జంతువు లేదన్నట్లుగా మభ్యపెడతాయి. సమయం చూసుకుని పంజా విసురుతాయి. సింహం, పులి, చిరుత.. ఇలాంటి ట్రాప్స్ వేయడంలో సిద్దహస్తులు. ఇక ఇంటర్నెట్‌లో అడవి జంతువులకు సంబంధించిన ఫోటోలు కోకొల్లలు. తాజాగా ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ ఒకరు ఫోటో పజిల్ ఒకటి ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఆ ఫోటోలో ఎన్ని పులులు ఉన్నాయో గుర్తుపట్టాలంటూ నెటిజన్లకు సవాల్ విసురుతున్నారు. మరి లేట్ ఎందుకు మీరూ ఓ లుక్కేయండి..
పులులు సహజంగా మనం ఎంత దూరంలో ఉన్నా పసిగడతాయి. కానీ వాటిని మాత్రం మనం చూడలేం. అవి అలా మన కళ్ళను మభ్యపెడతాయి. ఈ ఫోటోలో కూడా అంతే!.. తమ ఎరను వేటాడేందుకు అవి కనబడకుండా దాక్కున్నాయి. మీ కళ్లకు పరీక్ష పెట్టి.. ఫోటోను కాస్త తీక్షణంగా చూస్తే పులులను కనిపెట్టేయగలరు. ఒకవేళ మీకు అంతగా పులులు ఎన్ని ఉన్నాయో తెలియకపోతే.. అప్పుడు సమాధానం కోసం కింద ఫోటోపై లుక్కేయండి.
