AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సోషల్ మీడియాపై ఆర్మీ కొత్త రూల్స్.. ఇన్‌స్టా చూడొచ్చు.. కానీ

సోషల్ మీడియాపై ఆర్మీ కొత్త రూల్స్.. ఇన్‌స్టా చూడొచ్చు.. కానీ

Phani CH
|

Updated on: Dec 28, 2025 | 5:10 PM

Share

భారత సైన్యం జవాన్ల సోషల్ మీడియా వినియోగ నిబంధనలను సవరించింది. ఇప్పుడు జవాన్లు ఇన్‌స్టాగ్రామ్‌ను చూడటానికి మాత్రమే పరిమితంగా ఉపయోగించవచ్చు, వ్యాఖ్యలు, లైక్‌లు నిషేధం. యూట్యూబ్, ఎక్స్‌లలో చర్చల్లో పాల్గొనరాదు. వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్‌లు తెలిసినవారితో సాధారణ సంభాషణలకు మాత్రమే అనుమతి. ఆపరేషనల్ భద్రత, డిజిటల్ అవగాహనపై సైన్యం దృష్టి సారించింది, తప్పుడు సమాచారాన్ని నివేదించాలని సూచించింది.

భారత సైన్యం తన సోషల్ మీడియా వినియోగంపై కీలకమైన మార్పులు చేసింది. జవాన్ల సోషల్ మీడియా వినియోగంలో ఇప్పటివరకు ఉన్న ఆంక్షల నుంచి కొంత వెసులుబాటు కలిగింది. మారిన నిబంధనల ప్రకారం జవాన్లు ఇన్స్ట్రాగ్రామ్ పరిమితంగా వాడవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే అందులో సమాచారం చూడవచ్చు కానీ దానికి సంబంధించి కామెంట్స్ చేయటం, లైక్, ఫార్వర్డ్ , చేయటం వంటివి చేయకూడదు. కేవలం పర్యవేక్షణకోసం మాత్రమే వినియోగించాలని సైన్యం స్పష్టం చేసింది. సైన్యం ప్రస్తుతం ఇన్స్ట్రాగ్రామ్ ను అధికారికంగా పరిమిత వినియోగం ఉన్న సోషల్ మీడియా యాప్ ల లిస్ట్ లో చేర్చింది. ఇందులో ఇప్పటికే యూట్యూబ్, ఎక్స్‌ ఉన్నాయి. వీటిలో జవాన్లు ఎలాంటి చర్చల్లో పాల్గొనకూడదు. వీటిని ఉల్లఘించింట్లు నిర్ధారణ జరిగితే నిబంధనలమేరకు చర్యలు తీసుకుంటారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఇంటిలిజెన్స్ ద్వారా జారీ చేయబడ్డ ఈ నూతన నిబంధనలు తక్షణమే అమల్లోకి వచ్చాయి. స్కైప్, వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి మెసేజింగ్ యాప్స్ ను కేవలం సాధారణ సందేశాలు పంపుకోవడానికి మాత్రమే వినియోగించాలి. కేవలం తెలిసిన వ్యక్తులతో మాత్రమే మెసేజ్లు చేయాలి. ఈ విషయంలో యూజర్లదే పూర్తి భద్రతగా ఉంటుంది. డిజిటల్ అవగాహన- ఆపరేషనల్ భద్రత వీటి మధ్య సమతుల్యత ను జవాన్లు గుర్తించాల్సి ఉంటుంది. ఈ కొత్త ఆదేశాలను ఆర్మీలోని అన్ని యూనిట్లకు, విభాగాలకు పంపించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న పరిణామాలపై అవగాహన పెంచుకోవడానికి, సమాచారాన్ని సేకరించడానికి సైనికులకు ఇది వీలు కల్పిస్తుంది. అంతేకాకుండా తప్పుడు లేదా నకిలీ పోస్టులను గుర్తిస్తే, వాటిని సీనియర్ అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం కూడా కల్పించారు. ఇటీవలే ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఈ విషయంపై స్పందిస్తూ.. నేటి ఆధునిక ప్రపంచంలో సైనికులకు స్మార్ట్‌ఫోన్ ఒక అత్యవసరమని అన్నారు. “దూరంగా విధులు నిర్వర్తించే సైనికుడు తన పిల్లల ఫీజులు కట్టాలన్నా, కుటుంబ సభ్యుల బాగోగులు తెలుసుకోవాలన్నా ఫోన్ తప్పనిసరి. అందుకే మేము వాటిని కాదనలేం” అని ఆయన వివరించారు. అదే సమయంలో సోషల్ మీడియా వినియోగంపై స్పందిస్తూ, “ప్రతిస్పందించడానికి, ప్రతిచర్యకు చాలా తేడా ఉంది. వెంటనే జవాబు ఇవ్వడం ప్రతిచర్య. ఆలోచించి, విశ్లేషించి సమాధానం ఇవ్వడం ప్రతిస్పందన. మా సైనికులు ప్రతిచర్యలో పాల్గొనవద్దు. అందుకే సోషల్ మీడియాను కేవలం చూడటానికి అనుమతిస్తున్నాం. రిటైర్ అయ్యాక రిప్లై ఇవ్వండి” అని జనరల్ ద్వివేది పేర్కొన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

క్రిస్మస్‌ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత

Gmail: గుడ్‌ న్యూస్‌.. మీ మెయిల్‌ ఐడీని మార్చుకోవచ్చు.. ఈ విధంగా

తొలి విడత జనగణనకు సర్వం సిద్ధం.. ముందుగా లెక్కించేది వాటినే

Srisailam: శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్

Samantha: ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను