AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Loan: గోల్డ్ లోన్ తీసుకోవడం ఎంతవరకు ప్రయోజనకరం.. ఈ రుణం కావాలంటే క్రెడిట్‌ స్కోర్‌ చూస్తారా?

భారతదేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు బంగారం కొనుగోలు చేస్తుంటారు. ఈ బంగారం అత్యవసర పరిస్థితుల్లోనూ ఉపయోగపడుతుంది. బంగారాన్ని భౌతిక రూపంలో అంటే ఆభరణాలు, నాణేల..

Gold Loan: గోల్డ్ లోన్ తీసుకోవడం ఎంతవరకు ప్రయోజనకరం.. ఈ రుణం కావాలంటే క్రెడిట్‌ స్కోర్‌ చూస్తారా?
Gold Loan
Follow us
Subhash Goud

|

Updated on: Dec 20, 2022 | 8:24 AM

భారతదేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు బంగారం కొనుగోలు చేస్తుంటారు. ఈ బంగారం అత్యవసర పరిస్థితుల్లోనూ ఉపయోగపడుతుంది. బంగారాన్ని భౌతిక రూపంలో అంటే ఆభరణాలు, నాణేల రూపంలో కొనుగోలు చేస్తారు. ఇది వాటిని భవిష్యత్తులో ఉపయోగించుకునేలా చేస్తుంది. కరోనా మహమ్మారి సమయంలో ఎంతో మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. అలాగే వ్యాపారస్తులకు కూడా ఇబ్బందిగా మారింది. సరైనా వ్యాపారం జరగక ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇలాంటి సమయంలో బంగారం బాధిత కుటుంబాలకు ఆసరాగా మారింది. మీకు కావలసినప్పుడు మీరు బంగారాన్ని అమ్మవచ్చు.. మీరు బంగారంపై లోన్ కూడా తీసుకోవచ్చు.

గోల్డ్ లోన్ ఫైనాన్స్ కంపెనీ మనుప్పురం నివేదిక ప్రకారం.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచంలోని మొత్తం బంగారం హోల్డింగ్‌లలో భారతీయ కుటుంబాలు 12.9 శాతం వాటా కలిగి ఉన్నాయి. 2022 సంవత్సరంలో దాని వాటా 13.6 శాతానికి పెరిగింది. 2026-27 నాటికి ఈ సంఖ్య 14.1 శాతానికి చేరుతుందని అంచనా. పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్ పార్ట్ జితేంద్ర సోలంకి ఇలాంటి వాటిపై పలు విషయాలను వెల్లడించారు. భవిష్యత్తులో లిక్విడిటీ అవసరాలను తీర్చడానికి బంగారు రుణాలు మంచి ఎంపిక అని ఆయన చెప్పారు. ఈ ప్రయోజనం కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు బంగారాన్ని కొనుగోలు చేస్తారు. ద్రవ్యోల్బణాన్ని అధిగమించేందుకు ఇది సమర్థవంతమైన ఆప్షన్‌. బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు దాని ధరలో 75 శాతం వరకు సులభంగా రుణాలు ఇస్తాయి. ధర, లోన్‌ల నిష్పత్తిని వాల్యూ ఫర్ లోన్ అని అంటారు.

బ్యాంక్ లేదా నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ) నుంచి గోల్డ్ లోన్ తీసుకోవాలా? అంటే అది పెద్దగా పట్టింపు లేదని సోలంకి చెప్పారు. లోన్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినపుడు ఈ లోన్ చౌక ధరకు, సులభ నిబంధనలపై ఎక్కడ లభిస్తుందో చూడండి. వడ్డీ, అసలు మొత్తం చెల్లింపులో మీకు ఎక్కడ సౌలభ్యం లభిస్తుంది అనే అంశాన్ని పరిశీలించండి. బంగారు రుణాలను నియత్రించే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల నియమాలు దాదాపు ఒకే విధంగా ఉన్నప్పటికీ, వడ్డీ రేట్లు చాలా భిన్నంగా ఉంటాయి. ప్రస్తుతం బ్యాంకుల బంగారు రుణాలపై వడ్డీ రేట్లు 7, 15 శాతం మధ్య ఉన్నాయి. అయితే ఎన్‌బీఎఫ్‌సీలు 24 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తున్నాయి. ప్రస్తుతం ఇవి సులభమైన నిబంధనలపై రుణాలు అందిస్తున్నాయి. చాలా కంపెనీలు మీ ఇంటి వద్దే గోల్డ్ లోన్ అందిస్తాయి. ఎన్‌బీఎఫ్‌సీలతో పోలిస్తే, బ్యాంకుల గోల్డ్ లోన్ ప్రక్రియ చాలా కఠినమైదని సోలంకీ వివరించారు.

ఇవి కూడా చదవండి

గోల్డ్‌ లోన్‌ స్వల్ప కాలం ఎంత..?

అయితే గోల్డ్ లోన్ ఒకటి నుంచి మూడు సంవత్సరాల స్వల్ప కాలానికి మంజూరు చేస్తారు. మీ క్రెడిట్‌ స్కోర్ పట్టింపు ఉండదు. మీ వద్ద బంగారం ఉంటే చాలు . అందుకే దేశంలో గోల్డ్ లోన్ పరిధి వేగంగా పెరుగుతోంది. 2020 అక్టోబర్‌లో 52,843 కోట్ల రూపాయల విలువైన గోల్డ్ లోన్స్ మంజూరయ్యాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) డేటా చెబుతోంది. అక్టోబర్ 2021లో ఈ సంఖ్య 37 శాతం వృద్ధితో 72,420 కోట్ల రూపాయలకు చేరుకుంది. అక్టోబర్ 2022లో 83,620 కోట్ల రూపాయల విలువైన గోల్డ్ లోన్స్ మంజూరు అయ్యాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 15.5 శాతం ఎక్కువ.

గోల్డ్‌ లోన్‌లో సకాలంలో వడ్డీ చెల్లించకపోతే పెనాల్టీ పడుతుందా?

ఒక విషయం ఏంటంటే మీకు కూడా గోల్డ్ లోన్ కావాలంటే దాని వడ్డీని ప్రతి నెలా చెల్లించాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. సకాలంలో వడ్డీ చెల్లించనందుకు ఆర్థిక సంస్థలు జరిమానాలు విధిస్తాయి. పెనాల్టీ చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు నిర్ణీత వ్యవధిలో వడ్డీని చెల్లించకుంటే, రుణదాతలు మీ బంగారాన్ని వేలం వేయవచ్చు. అయితే దీనికి ముందు ఆర్థిక సంస్థలు నోటీసులు, హెచ్చరికలు జారీ చేస్తాయి. అందుకే గోల్డ్ లోన్ పై వడ్డీని సకాలంలో చెల్లిస్తూ ఉండండి. డబ్బులు సమకూర్చుకుని అసలు మొత్తాన్ని తిరిగి చెల్లించి, మీ బంగారాన్ని తిరిగి తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి