AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎంత దారుణం.. అద్దెదారుడి మృతదేహాన్ని ఇంట్లోకి అనుమతించని యజమాని.. పోలీసుల ఎంట్రీతో..

మానవత్వం మంట కలిసింది.. కనీసం మానవ ధర్మాన్ని పాటించని ఒక ఇంటి ఓనర్ తన ఇంట్లో అడ్డుకుంటున్న వ్యక్తి చనిపోతే అతని మృతదేహాన్ని ఇంట్లోకి అనుమతించని సంఘటన ప్రొద్దుటూరులో చోటుచేసుకుంది. మనిషి చనిపోయి మృతదేహాన్ని ఇంటికి తీసుకొని వస్తే.. నా ఇంట్లోకి రావద్దు అంటూ అడ్డగించిన ఆ ఇంటి యజమానిపై స్థానికులు మండిపడ్డారు.

ఎంత దారుణం.. అద్దెదారుడి మృతదేహాన్ని ఇంట్లోకి అనుమతించని యజమాని.. పోలీసుల ఎంట్రీతో..
Landlord Tenant Dispute
Sudhir Chappidi
| Edited By: |

Updated on: Dec 28, 2025 | 6:27 PM

Share

ఇంట్లో రెంట్‌కు ఉంటున్న ఓ వ్యక్తి అనారోగ్యం కారణంగా మరణిస్తే.. అతని మృతదేహాన్ని ఇంటి ఓనర్ ఇంట్లోకి అనుమతించని ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరులో వెలుగు చూసింది. ఇంట్లో ఉన్నన్ని రోజులు అద్దె తీసుకున్న ఆ యజమాని మానవత్వాన్ని మరిచి కనీసం మానవ ధర్మం లేకుండా తన కఠినమైన గుణాన్ని బయట పెట్టాడు. దాదాపు రెండు గంటలసేపు మృతదేహాన్ని ఇంటిలోకి రానివ్వకుండా బయటే ఉంచాడు.

అయితే అది గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని ఇంట్లోకి రాకుండా అడ్డుకున్న యజమాని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఈ విషయాన్ని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. యజమానికి సర్దిచెప్పి మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకెళ్లారు.

అయితే అద్దె ఇచ్చి నన్నాళ్లు డబ్బులు దండుకొని మనిషి చనిపోతే ఇంత క్రూరంగా ఎలా వ్యవహరిస్తాడు అని ఇంటి ఓనర్ మానవత్వం లేని తీరును స్థానికులు ఎండగట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. చివరకు పోలీసుల రాకతో సమస్య సద్దుమణిగింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.