AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కారులో గర్ల్ ఫ్రెండ్ ఉండగానే అభిమాని కామెంట్‌.. హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్

కారులో గర్ల్ ఫ్రెండ్ ఉండగానే అభిమాని కామెంట్‌.. హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్

Phani CH
|

Updated on: Dec 28, 2025 | 5:56 PM

Share

క్రిస్మస్ వేడుకల అనంతరం హార్దిక్ పాండ్యాను ఒక అభిమాని సెల్ఫీ ఇవ్వలేదని తిట్టాడు. ఈ ఘటనకు హార్దిక్ పాండ్యా ఏమాత్రం స్పందించకుండా ప్రశాంతంగా వెళ్ళిపోయాడు. ఈ వీడియో వైరల్ కావడంతో, హార్దిక్ సహనంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తూ, దురుసుగా ప్రవర్తించిన అభిమానిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో, బయట కూడా అంతే వార్తల్లో ఉంటాడు.

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో, బయట కూడా అంతే వార్తల్లో ఉంటాడు. తాజాగా హార్దిక్ తన స్నేహితురాలు మహికా శర్మతో కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి ఒక రెస్టారెంట్‌కు వెళ్లాడు. అక్కడ నుంచి బయటకు వస్తుండగా ఒక అభిమాని చేసిన వెర్రి పని ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. సెల్ఫీ ఇవ్వలేదన్న కోపంతో ఒక వ్యక్తి హార్దిక్‌ను ఉద్దేశించి అత్యంత దారుణంగా భాడ్‌ మే జా అంటూ నోరు పారేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. రెస్టారెంట్ బయట హార్దిక్ పాండ్యాను చూడటానికి పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. హార్దిక్ తన సెక్యూరిటీ మధ్యలో నడుచుకుంటూ వచ్చి, ముందుగా మహికా శర్మను సురక్షితంగా కారులో కూర్చోబెట్టాడు. ఆ తర్వాత కొంతమంది అభిమానులకు సెల్ఫీలు ఇచ్చాడు. అయితే రద్దీ ఎక్కువగా ఉండటంతో ఒక వ్యక్తికి సెల్ఫీ తీసుకునే అవకాశం దక్కలేదు. దీంతో ఆ వ్యక్తి అసహనానికి లోనై, హార్దిక్ కారు ఎక్కుతుండగా వెనుక నుంచి గట్టిగా తిట్టాడు. అయితే ఈ అవమానాన్ని హార్దిక్ అస్సలు పట్టించుకోకపోవడం గమనార్హం. ఈ మాట విన్నప్పటికీ హార్దిక్ పాండ్యా వెనక్కి తిరిగి చూడలేదు సరే కదా, కనీసం ముఖంలో అసహనం కూడా ప్రదర్శించలేదు. చాలా ప్రశాంతంగా కారు ఎక్కి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అది హార్దిక్ కు వినిపించలేదా లేక విన్నా కూడా కావాలనే ఇగ్నోర్ చేశారా అనేది పక్కన పెడితే.. అతను ప్రదర్శించిన సహనానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో ఆ తిట్టిన వ్యక్తిని నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. “సెలబ్రిటీలు కూడా మనుషులే, వారికి ప్రైవసీ ఉంటుంది.. ఇలా ప్రవర్తించడం సభ్యత కాదు” అంటూ హార్దిక్‌కు మద్దతుగా నిలుస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం

టీని రెండోసారి వేడి చేసి తాగుతున్నారా ?? మీ బాడీ షెడ్డుకే

విద్యుత్‌ స్తంభం ఎక్కిన ఎమ్మెల్యే.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు

Samantha: ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను

Gmail: గుడ్‌ న్యూస్‌.. మీ మెయిల్‌ ఐడీని మార్చుకోవచ్చు.. ఈ విధంగా