Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: కలియుగంలో అపర కుభేరుడు ఆయనే.. అంతకంతకూ పెరుగుతున్న వెంకన్న ఆదాయం

కలియుగంలో అపరకుభేరుడు ఆయనే. వెంకన్న ఆదాయం అంతకంతకు పెరుగుతుండటమే అందుకు నిదర్శనం. తిరుమలేశుడు.... వెల కట్టలేని ఆస్తులున్న సంపన్నుడు. ఏటేటా పెరుగుతున్న శ్రీవారి ఆదాయం.. టీటీడీ వార్షిక బడ్జెట్‌ను పెంచేస్తోంది. ఇటు హుండీ, అటు డిపాజిట్లపై వచ్చే వడ్డీ రూపంలో ఏడుకొండవారి ఆస్తుల విలువ కొండంత అవుతోంది.

Tirumala: కలియుగంలో అపర కుభేరుడు ఆయనే.. అంతకంతకూ పెరుగుతున్న వెంకన్న ఆదాయం
Tirumala Hundi Income
Follow us
Raju M P R

| Edited By: Ram Naramaneni

Updated on: Mar 26, 2025 | 7:21 PM

కలియుగంలో అపరకుభేరుడు ఆయనే. వెంకన్న ఆదాయం అంతకంతకు పెరుగుతుండటమే అందుకు నిదర్శనం.  అయితే ఇటు హుండీ, అటు డిపాజిట్లపై వచ్చే వడ్డీనే ఆదాయంలో సింహం భాగం. రూ. 5258 కోట్ల టీటీడీ అంచనా బడ్జెట్‌లో ఈ విషయం మరోసారి స్పష్టం అయ్యింది. రూ. 1729 కోట్లు హుండీ ఆదాయంతో పాటు డిపాజిట్లపై వచ్చే వడ్డీ రూ. 1310 కోట్లు వరకు ఉండనుంది. కోవిడ్ తర్వాత దాదాపు రెండింతలైన హుండీ ఆదాయంతో వెంకన్న ఆస్తుల విలువ కొండంత అవుతోంది.

తిరుమలేశుడు.. వెల కట్టలేని ఆస్తులున్న సంపన్నుడు. ఏటేటా పెరుగుతున్న వెంకన్న ఆదాయం టిటిడి వార్షిక బడ్జెట్‌ను కూడా పెంచుతోంది. ఇలా 2025-26 వార్షిక బడ్జెట్ లో రాబడి ఆదాయాన్ని లెక్క కట్టిన టీటీడీ.. ప్రధాన ఆదాయ వనరులు హుండీ నగదుతో పాటు… డిపాజిట్లపై వడ్డీనేనని తేల్చింది. 2024-25 ఏడాదికి రూ. 5141.74 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసిన టిటిడి.. సవరించిన అంచనాల మేరకు రూ. 5179.85 కోట్లుగా పేర్కొంది.

ఇక 2025-26 వార్షిక ఏడాది బడ్జెట్ అంచనాలను బయటపెట్టిన టిటిడి రూ.5258.68 కోట్లుగా పేర్కొంది. స్వల్పంగా అంటే రూ. 78.83 కోట్లు అదనంగా అంచనా బడ్జెట్‌ను ఆమోదించింది. ఈ లెక్కలు పక్కన పెడితే బడ్జెట్ లో ప్రధాన అంకెలు శ్రీవారి హుండీ ఆదాయం, డిపాజిట్ల ద్వారా వచ్చే వడ్డీనే అధికంగా ఉన్నాయి. బడ్జెట్ లో పొందుపరిచిన అంచనాల వివరాల ప్రకారం హుండీ ఆదాయం ఈ ఏడాది రూ. 1729 కోట్ల రూపాయలు ఉంటుందని టిటిడి అంచనా వేస్తోంది. ఇక వడ్డీ రూపంలో రూ. 1310 కోట్ల మేర ఆదాయం టిటిడి ఖజానాకు జమ అవ్వొచ్చని భావిస్తోంది. మొత్తం అంచనా బడ్జెట్ లో సగానికి పైగా హుండీ, వడ్డీ రూపంలోనే వెంకన్నకు ఆదాయం సమకూరుతోందన్న విషయం స్పష్టమవుతోంది. హుండీ, వడ్డీ రూపంలో దాదాపు రూ. 3039 కోట్ల మేర టిటిడి కి ఆదాయం రానుంది.

కోవిడ్ తరువాతే కొండంత ఆదాయం.

కోవిడ్ కు ముందు రూ. 900 నుంచి 1000 కోట్ల రూపాయలకు లోపే ఉండే ఆదాయం గత నాలుగేళ్లుగా అంతకంతకు పెరుగుతోంది. కోవిడ్ అనంతరం భారీగా పెరిగిన వెంకన్న ఆదాయం క్రమక్రమంగా రెట్టింపు అయింది. 2022-23 బడ్జెట్ లో హుండీ ద్వారా రూ. వెయ్యి కోట్లు లభిస్తుందని అంచనా వేసిన టిటిడి ఊహించని విధంగా రూ.1613 కోట్ల ఆదాయాన్ని పొందింది. ఇక 2023-24 ఏడాదిలో రూ. 1611 కోట్లు, 2024-25 గాను ఇప్పటిదాకా రూ. 1671 కోట్ల ఆదాయం హుండీ ద్వారా టీటీడీకి లభించింది. ఇక బ్యాంకుల్లో ఉన్న నగదు డిపాజిట్ల నుంచి టీటీడీకి పెద్ద మొత్తంలోనే ఆదాయం సమకూరుతోంది.

హుండీతో పోటీపడుతున్న వడ్డీ

ఇక శ్రీవారి హుండీ ఆదాయంతో వడ్డీ ఆదాయం కూడా పోటీ పడుతున్నట్లు కనిపిస్తోంది. 2024-25 ఏడాదికి గాను వడ్డీ రూపంలో రూ. 1167 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేసిన టిటిడి రూ. 1253 కోట్లను పొందింది. ఈ నేపథ్యంలోనే 2025-26 నూతన బడ్జెట్ లో రూ.1310 కోట్ల మేర వడ్డీ రూపంలో శ్రీవారి ఖాతాకు జమ అవుతుందని టిటిడి అంచనా వేస్తోంది. కోవిడ్ కు ముందు వరకు వడ్డీ రూపంలో టీటీడీకి లభిస్తున్న ఆదాయం ప్రస్తుతం లభిస్తున్న ఆదాయానికి భారీ తేడానే ఉంది. కోవిడ్ ముందు వడ్డీ రూపంలో టీటీడీకి రూ. 800 కోట్ల లోపే ఉన్న ఆదాయం కోవిడ్ అనంతరం దాదాపు అదనంగా రూ. 500 కోట్ల మేర పెరిగింది.

ప్రసాదాలు, దర్శనాలతోనూ వెంకన్నకు భారీ ఆదాయమే.

ఇక హుండీ, వడ్డీ నుంచి వచ్చే ఆదాయమే కాకుండా టీటీడీకి భక్తుల దర్శనాలు, వసతి ప్రసాదాల విక్రయం ద్వారా కూడా టిటిడి కి ఆదాయం సమకూరుతోంది. గతేడాది రూ. 338 కోట్లు దర్శనం పై వస్తుందని అంచనా వేసిన టీటీడీకి రూ. 305 కోట్ల ఆదాయం వచ్చింది. ఏడాది అంచనా బడ్జెట్ లో దర్శనంపై వచ్చే ఆదాయం రూ. 310 కోట్ల మీద వస్తుందని టీటీడీ భావిస్తోంది. ఇక ప్రసాదాల ద్వారా టీటీడీకి గత ఏడాది రూ. 600 కోట్లు ఆదాయం లభిస్తుందని అంచనా వేసిన టిటిడి అనుకున్నంత ఆదాయాన్ని మాత్రం పొందలేకపోయింది. దీంతో ఈ ఏడాది ప్రసాదాల విక్రయం ద్వారా వెంకన్నకు వచ్చే ఆదాయం రూ. 600 కోట్ల మేర ఉంటుందని అంచనా బడ్జెట్ లో టీటీడీ లెక్కలు వేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..